
సాక్షి, ఆదోని: ఆదోని రైతు బజారులో మంగళవారం కిలో టమాటా రూ.105గా ఉండగా, ఝాన్సీలక్ష్మీబాయి మార్కెట్‌లో రూ.140 పలికింది. వర్షాలకు పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గి, ఇదే సమయంలో పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో వినియోగం పెరిగి డిమాండ్ ఏర్పడింది. దీంతో మార్కెట్‌లో టమాటా ధర వినియోగదారులను బెంబేలెత్తిస్తుండగా రైతులను మురిపిస్తోంది. సాధారణంగా ప్రతి రోజు ఆదోని మార్కెట్‌కు చుట్టు పక్కల పల్లెల నుంచి 300 గంపలు, ఆస్పరి మార్కెట్‌కు వెయ్యికి పైగా బాక్సులు రైతులు అమ్మకానికి తెస్తారు. మంగళవారం ఆదోనికి 40 గంపలు, ఆస్పరి మార్కెట్‌కు 150 బాక్స్‌లు వచ్చాయి. ఆస్పరి మార్కెట్‌లో 20 కిలోల బాక్స్ రూ.1,500 పలుకగా, ఆదోని మార్కెట్‌లో రెండు గంపలు రూ.1,500 పలికాయి. కిలో రూ. 75 ప్రకారం రైతుకు గిట్టుబాటు అవుతోంది.
చదవండి: (విషాదం: తెల్లవారితే పెళ్లి అంతలోనే ఆస్పత్రి పాలై..)
Comments
Please login to add a commentAdd a comment