వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా గోపాల్‌రెడ్డి
Published Sun, Mar 26 2017 11:28 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM
ఆదోని టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శిగా ఆదోనికి చెందిన ఎస్ గోపాల్‌రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఆదివారం ఆదోనిలో రాజశ్రీ ఫంక‌్షన్‌హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోపాల్‌రెడ్డి మాట్లాడారు. మూడేళ్లుగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ పార్టీ పటిష్టతకు కృషి చేశానన్నారు. పార్టీ అధిష్టానం తన సేవలను గుర్తించి పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి పదవిని ఇచ్చిందన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రాణమున్నంతవరకు సాయిప్రసాద్‌రెడ్డిని వదిలి ఎక్కడికీ వెళ్లనని చెప్పారు. సమావేశంలో కల్లుబావి వార్డు ఇన్‌చార్జ్ నాయకులు వీరభద్రారెడ్డి, మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, వెంకటేష్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement