సాక్షి, కర్నూల్ : ఆదోనిలో దారుణం చోటుచేసుకుంది. కన్నకూతురిపై కత్తితో దాడిచేశాడో తండ్రి. కర్నూలు జిల్లా ఆదోని శంకర్ నగర్‌కు చెందిన అంజలి అనే యువతిపై ఆమె తండ్రి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని స్థానికులు అంటున్నారు. దాడి అనంతరం నిందితుడు అక్కడినుంచి పరారయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
Comments
Please login to add a commentAdd a comment