ధర్మానికి..అధర్మానికి మధ్య ఎన్నికలు  | Election Between Equity and Inequity | Sakshi
Sakshi News home page

ధర్మానికి..అధర్మానికి మధ్య ఎన్నికలు 

Published Thu, Mar 14 2019 10:55 AM | Last Updated on Thu, Mar 14 2019 10:57 AM

Election Between Equity and Inequity - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సాయి 

సాక్షి, ఆదోని రూరల్‌: ధర్మానకి... అధర్మానికి మధ్య  త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓటు ఆయుధంతో అక్రమార్కులకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.   ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో  దోపిడీలు, దౌర్జన్యాలతో ప్రజలు విసుగు చెందారని, టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.   బుధవారం మండల పరిధిలో ని మేజర్‌ పంచాయతీ మండగిరిలో ‘రావాలి జగన్‌– కావాలి జగన్‌’ కార్యక్రమం  నిర్వహించారు.  

ఆర్ట్స్‌ కళా శాల వద్ద   నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ  బాణాసంచా పేల్చుతూ ఎమ్మెల్యేను ఘనంగా  ఆహ్వానించారు. అనంతరం ఓ ఫంక్షన్‌హాల్‌లో  జిల్లా కార్యద ర్శి శేషిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో  ఎమ్మెల్యే మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హా మీల్లో   చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా  నెరవేర్చలేదని విమర్శించారు.  కేవలం తన పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవన్నారు.

 రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌  దోపిడీకి పాల్పడ్డారని,  జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు  పేదల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు.  పాదయాత్రలో  వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని అన్ని వర్గాలకు మేలు చేకూరే విధంగా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకాలు ప్రయోజనాలను గుర్తించిన సీఎం చంద్రబాబు కాపీ కొట్టి పింఛన్‌ పెంచారని, పసుపు– కుంకుమ అంటూ మహిళలను, పెట్టుబడి సాయం అంటూ రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు.

  
ఆదోని అభివృద్ధికి అడ్డుపడ్డారు...
తాను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో  ఉంటూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే అధికారపార్టీ నాయకులు అడ్డుపడ్డారని ఎమ్మెల్యే సాయి ఆరోపిం చారు.  సీఎం చంద్రబాబు నాయుడు  రాజ్యాంగానికి వి రుద్ధంగా  ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులను తమ పా ర్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇచ్చారని విమర్శించారు.    

దీంతో టీడీపీ నాయకులు అధికార బలం చూపుతూ జేబులు నింపేసుకున్నారని ఆరోపించారు. మితిమీరిన అక్రమాల మూలంగానే స్థానికి నేతకు టి క్కెట్‌ కూడా రావడం లేదని, రాజధానిలో నిరీక్షిస్తున్నా డని ఎద్దేవా చేశారు.  

కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రాజకీయ సలహాదారుడు డాక్టర్‌ మధుసూదన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, మండల కన్వీనర్‌ గురునాథ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి శేషిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు కల్లుపోతుల సు రేష్, జిల్లా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, రామలింగేశ్వర యాదవ్, పట్టణ అధ్యక్షుడు దేవా, పట్టణ ఎస్సీ సెల్‌ కార్యదర్శి ఎస్‌.నారాయణ, పట్టణ బీసీ సెల్‌ అధ్యక్షుడు కురువ మహేష్, ముస్లిం మైనార్టీ నాయకు లు  సయ్యద్‌ అహ్మద్, సునార్‌ అబ్దుల్‌ ఖాదర్, ఆర్టీసీ రెహ్మాన్,  మండగిరి నాయకులు ఉసేనప్ప, ఉలిగప్ప, రవిశంకర్‌ యాదవ్, అలీదాస్, నర్సింహులు, గిరిజమ్మ, గిడ్డయ్య, దొమ్మరి లక్ష్మన్న, మాధవ్, చిన్న శీను, గాదిలింగ, మహేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement