MLA Sai prasad reddy
-
ఆదోని ప్రభుత్వాసుపత్రిని తనికీ చేసిన ఎమ్మెల్యే
-
ధర్మానికి..అధర్మానికి మధ్య ఎన్నికలు
సాక్షి, ఆదోని రూరల్: ధర్మానకి... అధర్మానికి మధ్య త్వరలో జరుగనున్న ఎన్నికల్లో ఓటు ఆయుధంతో అక్రమార్కులకు గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ పాలనలో దోపిడీలు, దౌర్జన్యాలతో ప్రజలు విసుగు చెందారని, టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బుధవారం మండల పరిధిలో ని మేజర్ పంచాయతీ మండగిరిలో ‘రావాలి జగన్– కావాలి జగన్’ కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్స్ కళా శాల వద్ద నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పెద్దఎత్తున స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా పేల్చుతూ ఎమ్మెల్యేను ఘనంగా ఆహ్వానించారు. అనంతరం ఓ ఫంక్షన్హాల్లో జిల్లా కార్యద ర్శి శేషిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 హా మీల్లో చంద్రబాబు ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదని విమర్శించారు. కేవలం తన పార్టీ నాయకులు, కార్యకర్తలు తప్పా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవన్నారు. రాజధాని పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ దోపిడీకి పాల్పడ్డారని, జన్మభూమి కమిటీల పేరుతో తెలుగు తమ్ముళ్లు పేదల సొమ్ము దోచుకున్నారని ఆరోపించారు. పాదయాత్రలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకుని అన్ని వర్గాలకు మేలు చేకూరే విధంగా నవరత్నాలు పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ పథకాలు ప్రయోజనాలను గుర్తించిన సీఎం చంద్రబాబు కాపీ కొట్టి పింఛన్ పెంచారని, పసుపు– కుంకుమ అంటూ మహిళలను, పెట్టుబడి సాయం అంటూ రైతులను మరోమారు మభ్యపెట్టేందుకు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఆదోని అభివృద్ధికి అడ్డుపడ్డారు... తాను ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉంటూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతుంటే అధికారపార్టీ నాయకులు అడ్డుపడ్డారని ఎమ్మెల్యే సాయి ఆరోపిం చారు. సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగానికి వి రుద్ధంగా ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులను తమ పా ర్టీకి చెందిన నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు ఇచ్చారని విమర్శించారు. దీంతో టీడీపీ నాయకులు అధికార బలం చూపుతూ జేబులు నింపేసుకున్నారని ఆరోపించారు. మితిమీరిన అక్రమాల మూలంగానే స్థానికి నేతకు టి క్కెట్ కూడా రావడం లేదని, రాజధానిలో నిరీక్షిస్తున్నా డని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ సలహాదారుడు డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోపాల్‌రెడ్డి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, మండల కన్వీనర్ గురునాథ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి శేషిరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కల్లుపోతుల సు రేష్, జిల్లా నాయకులు గోవర్ధన్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, రామలింగేశ్వర యాదవ్, పట్టణ అధ్యక్షుడు దేవా, పట్టణ ఎస్సీ సెల్ కార్యదర్శి ఎస్.నారాయణ, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు కురువ మహేష్, ముస్లిం మైనార్టీ నాయకు లు సయ్యద్ అహ్మద్, సునార్ అబ్దుల్ ఖాదర్, ఆర్టీసీ రెహ్మాన్, మండగిరి నాయకులు ఉసేనప్ప, ఉలిగప్ప, రవిశంకర్ యాదవ్, అలీదాస్, నర్సింహులు, గిరిజమ్మ, గిడ్డయ్య, దొమ్మరి లక్ష్మన్న, మాధవ్, చిన్న శీను, గాదిలింగ, మహేశ్వరరెడ్డి, ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. -
చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం
ఆదోని టౌన్ : అవినీతి అక్రమాల కేసుల్లో సీఎం చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. తనకు ఏదైనా జరిగితే ప్రజలు వలయంగా నిలుస్తారని, రాష్ట్రం అగ్నిగుండం అవుతుందంటున్న బాబు మాటలు వింటుంటే జైలుకు వెళ్లడం తథ్యమనే విషయం అర్థమవుతుందని చెప్పారు. ఆదివారం ఆదోని మండలం గోనబావి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే సమక్షంలో స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ మాజీ నాయకులు ఈరన్న, గోవిందు ఆధ్వర్యంలో అన్వర్‌తో పాటు లక్ష్మన్న, ఈరన్న, రంగన్న, చిన్న నర్సన్న, పెద్ద ఉసేని, బసప్ప తదితరులు పార్టీ తీర్థం పుచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయి మాట్లాడుతూ ఎవరికీ భయపాడాల్సిన అవసరం లేదని, అండగా తామున్నామని హామీ ఇచ్చారు. బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేస్తూ పేదల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు పేదల బతుకుల్లో వెలుగులు నింపడంతో నేటికీ ఆయనను స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. దోచుకో... దాచుకో నినాదంతో టీడీపీ నాయకులు ముందుకు సాగుతున్నారని ఆరోపించారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ద్వారా కోట్లాది రూపాయలు దాచుకున్న ఘనత టీడీపీ నేతలకే దక్కుతోందని విమర్శించారు. పేదలను పరామర్శించిన ఎమ్మెల్యే సాయి గుడిసెల్లోకి వరద నీరు చేరడంతో రాత్రంతా జాగారణ చేసిన పేదలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరామర్శించారు. వర్షం మూలంగా నిత్యావసర సరుకులు తడిసిపోవడంతో ఎనిమిది కుటుంబాలకు ఎమ్మెల్యే ఆర్థిక సాయం చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో సీఎం అవుతారని, పేదల కష్టాలన్నీ తొలగి పోతాయని భరోసా ఇచ్చారు. -
‘రైతురథం’ పచ్చ చొక్కాలకే
సాక్షి, ఆదోని: వ్యవసాయం చేసుకునేందుకు ట్రాక్టర్లు ఇచ్చే రైతు రథం పథకం పచ్చచొక్కాలకే పరిమితమైందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ధ్వజమెత్తారు. అర్హులైన రైతులు దరఖాస్తులు చేసుకున్నా ట్రాక్టర్లు మంజూరు కావడం లేదన్నారు. ఈ విషయం పలువురు రైతులు తన దృష్టికి తీసుకురావడంతో ఒక్కో ట్రాక్టర్‌పై రూ. లక్ష సబ్సిడీతో నియోజకవర్గంలోని 20 మందికి ఇప్పిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అలసందగుత్తి గ్రామానికి చెందిన రైతు ఉరుకుందప్పకు ట్రాక్టర్ అందజేశారు. అన్నదాత ఆనందంగా ఉండటం కోసం ఆ సబ్సిడీ మొత్తాన్ని ట్రాక్టర్ కంపెనీకి తానే చెల్లిస్తానన్నారు. అనంతరం ఆయన పార్టీ కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదన్నారు. పార్టీలకతీతంగా రైతు రథం కింద ట్రాక్టర్లు మంజూరు చేయాలని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు అన్నదాతలు సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో పార్టీలకతీతం సంక్షేమ పథకాలు మంజూరయ్యాయన్నారు. బాబు పాలనలో ఆ పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు పెద్దయ్య, మాజీ సర్పంచ్ పెద్ద పెద్దయ్య, ఉప సర్పంచ్ బసరకోడు ఈరన్న, పెద్దయ్య, రైతులు పాల్గొన్నారు. -
నీళ్లడిగితే అక్రమ కేసులా?
► అధికారుల తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా ► ఎవరి కోసం పనిచేస్తున్నారంటూ ఆదోని ఎమ్మెల్యే మండిపాటు ఆదోని టౌన్: ‘ఎండలు మండిపోతున్నాయి. ప్రజలతోపాటు పశువులు దాహంతో అలమటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాగేందుకు గుక్కెడు నీరు ఇవ్వాలని అధికారులను ప్రశ్నిస్తూ ఆందోళన చేస్తే అక్రమంగా కేసులు బనాయిస్తారా?’ అంటూ అధికారుల తీరుపై ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కార్యాలయాల్లో ఫ్యాన్ల కింద కూర్చుంటే ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గొంతులెండిపోతున్నాయని, గుక్కెడు నీళ్లివ్వాలని పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో సహనం కోల్పోయిన ఢణాపురం మహిళలు, సర్పంచు ఈరన్నగౌడ్, నాయకులు వీరయ్య, నర్సింహస్వామి బుధవారం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తే పోలీసులు అక్రమంగా కేసులు బనాయించడం సబబు కాదన్నా రు. అధికారుల తీరుపై అసెంబ్లీ లో ప్రస్తావిస్తానని చెప్పారు. ప్రస్తు తం జిల్లా కలెక్టర్‌కు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. సర్పంచ్ ఈరన్నగౌడు, ఆందోళనకారులు వైఎస్ఆర్సీపీ కావడంతోనే అధికార పార్టీ నాయకులు ఒత్తిళ్ల మేరకు అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులను విత్‌డ్రా చేసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. అధికారులు పక్షపాతం వీడకపోతే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి గోపాల్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు శేషిరెడ్డి పాల్గొన్నారు. -
నాటకాలతో చైతన్యం
ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆదోని: తరతరాల సంస్కృతి, సాంప్రదాయాలను ముందు తరాలకు అందించడంతోపాటు ప్రజా చైతన్యానికి వేదికగా ఉండే నాటకాలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్లో ప్రదర్శించిన ‘కళ్లగురు-సుళ్లశిష్య’ (దొంగ గురువు-అబద్ధాల శిష్యుడు) నాటకం ఆద్యంతమూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. గురూజీ ముసుగులో దొంగస్వామి, ఆయన శిష్యుడు చేసే అకృత్యాలు..అంతిమంగా వారి ఆగడాలకు చెక్ పెట్టడం వరకు మధ్యలో సాగిన సన్నివేశాలు, చతురోక్తులతో కూడిన సంభాషణలతో ఆయా పాత్రధారులు తమ పాత్రలను రక్తి కట్టించారు. ప్రముఖ నాట కళాకారులు నాగయ్యస్వామి, గంగాధర, యరగట్టి ప్రమోద్, గోకార, బసవరాజ మదిరి, గీతా గుళేదగుట్ట, హేమావతి, అంబిక, రవి జాలహాళ తదితరులు వివిధ పాత్రలను ధరించారు. సామాజిక సందేశంతో కూడిన ఈ నాటక ప్రదర్శనకు ముందు ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రంగస్థల ప్రదర్శనలకు ప్రోత్సాహం కరువవుతోందని, దీనినే నమ్ముకున్న కళాకారుల జీవితాలు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రంగస్థలం కూడా ఒక శక్తివంతమైన మాధ్యమమేనని, కొన్ని నాటకాలు ప్రజలను ఎంతగానో చైతన్యవంతుల్ని చేశాయని కొన్నింటిని ఉదహరించారు. నాటక రంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నాటక ప్రదర్శనను ఏర్పాటు చేసిన ఘన మఠేశ్వర నాట్య సంఘం నిర్వాహకులు కె.మహేబలేశ్వరప్ప, చెన్నబసప్పను ఆయన అభినందించారు. అధికారులతో మాట్లాడి రిక్రియేషన్ క్లబ్ నాటక ప్రదర్శన వేదిక అద్దెను రద్దు చేయిస్తానని హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ, కళాకారులకు ప్రభుత్వం తనవంతుగా చేయూతనందిస్తే నాటకాలు ఎప్పుడూ సజీవంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్, పట్టణ ప్రముఖులు సూగూరప్ప, ప్రతాప్, చంద్రకాంత్‌రెడ్డి, విట్టారమేష్, సోమన్న, మదార్, రామలింగ, ఎండీ బసవరాజు, ముమ్మత్ స్వామి, కళాకారుడు గైక్వాడ్ విశ్వనాథ్ మరికొందరు పాల్గొన్నారు.