ఆదోని టౌన్ (కర్నూల్ జిల్లా) : పాఠశాల నుంచి విద్యార్థులతో తిరిగొస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఏడో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులతో పాటు టీచరు, క్లీనర్‌కు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఆదోని పట్టణ శివారు ప్రాంతం చెరగుట్ట క్రాస్‌రోడ్డులో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆదోనిలోని కారుణ్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు పాఠశాల అనంతరం టాటా మ్యాజిక్ వాహనంలో ఇంటికి తిరిగి వస్తుండగా చెరగుట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.
దీంతో టాటామ్యాజిక్ లోని విద్యార్థులు చందన, పూర్ణ, అక్షయ, ఉమా మహేష్, టీచర్ షమీంబీ, క్లీనర్ వెంకటేశ్ గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను 108 వాహనంలో దగ్గర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్ వ్యాన్ ను ఢీకొన్న లారీ
Published Thu, Mar 3 2016 7:25 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM
Advertisement
Advertisement