రైతుబజార్లలో తక్కువ ధరకు ఉల్లి విక్రయాలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. కర్నూలు నగరంలో
ఆదోని, న్యూస్‌లైన్: రైతుబజార్లలో తక్కువ ధరకు ఉల్లి విక్రయాలు చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలు కావడం లేదు. కర్నూలు నగరంలో కౌంటర్లను ఏర్పాటు చేసిన మార్కెటింగ్ శాఖ ఇతర పట్టణాల్లోని రైతుబజార్లలో ఆ కార్యక్రమం కూడా చేపట్టలేదు. దీంతో వ్యాపారులు అమ్మిన రేటుకే వినియోగదారులు వాటిని కోనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మార్కెట్‌లో ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకడంతో కిలో రూ.29 ప్రకారం రైతుబజార్లలో విక్రయించాలని ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను ఆదేశించింది. జిల్లాలోని ఆదోని, నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరుతో పాటు పలు నియోజకవర్గాల కేంద్రాలలో రైతుబజార్లలో ఇది అమలుకావాల్సి ఉంది. గత నెల 27న జిల్లా కలెక్టర్ సి.సుదర్శన రెడ్డి, జేసీ కన్నబాబు కర్నూలు సీ క్యాంపు, అబ్బాస్ నగర్, కొత్తపేట రైతు బజార్లలో కౌంటర్లు ప్రారంభించారు. మిగిలిన ప్రాంతాల్లోని రైతు బజార్లలో కూడా ఉల్లి కౌంటర్లు ప్రారంభం అవుతాయని, తక్కువ ధరకే ఉల్లి లభిస్తుందని వినియోగదారులు భావించారు. అయితే ఇప్పటి వరకు రైతు బజార్లలో ఉల్లి అమ్మకాలు ప్రారంభం కాలేదు. దీంతో వ్యాపారులు ప్రస్తుతం నాణ్యతను బట్టి కిలో రూ.48 నుంచి రూ.56 వరకు విక్రయిస్తున్నారు.
దళారులకే ఆదాయం
రైతులు తీసుకుని వచ్చిన ఉల్లి దిగుబడికి మార్కెట్‌లో క్వింటాలుకు రూ.3200 నుంచి రూ.3500 వరకు మాత్రమే చెల్లిస్తున్నారు. వినియోగదారులకు వ్యాపారులు కిలో రూ.48 చొప్పున విక్రయిస్తున్నారు. అటు రైతులు, ఇటు వినియోగదారులు నష్టపోతుండగా దళారులు, వ్యాపారులు మాత్రమే ఆదాయం పొందుతున్నారు. ఇప్పటికైనా మార్కెట్‌శాఖ అధికారులు స్పందించి కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో రూ.29 ప్రకారం ఉల్లి విక్రయించాలని ప్రజలు కోరుతున్నారు.