గోదావరి జిల్లాలో పరువుహత్య | honour killing in east godavari, youth killed | Sakshi
Sakshi News home page

గోదావరి జిల్లాలో పరువుహత్య

Jun 6 2017 1:06 PM | Updated on Sep 5 2017 12:57 PM

గోదావరి జిల్లాలో పరువుహత్య

గోదావరి జిల్లాలో పరువుహత్య

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది.

ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కోనసీమలోని మలికిపురం మండలం గొల్లపాలెంలో వెలుగుచూసింది. గత నెల రెండోతేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రామాంజనేయులు అనే యువకుడిని విజయ్‌కుమార్ హతమార్చారు.

పోలీసుల విచారణతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కరవాడ బీచ్ వద్ద ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. గత ఆరు నెలలుగా విజయ్‌కుమార్ కూతురు, రామాంజనేయులు ప్రేమించుకుంటున్ఆరు. ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లి, ఇటీవలే రామాంజనేయులు తిరిగొచ్చాడు. అంతలోనే అతడు హత్యకు గురి కావడంతో గొల్లపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు మొదలై పరస్పరం దాడులకు కూడా దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement