ramanjaneyulu
-
క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాలి
సాక్షి, హైదరాబాద్: మారిన వాతావరణ పరిస్థితులు, రైతుల ఆకాంక్షల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సరికొత్త సవాళ్లకు పాత కాలపు ఆలోచనలతో కూడిన పరిష్కారాలు సరిపడవని, క్లైమెట్ ఎమర్జెన్సీ కాలంలో సరికొత్త పరిష్కారాలు వెతకాల్సిన అవసరం ఉందని సుప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీవీ రామాంజనేయులు పిలుపునిచ్చారు. సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) మినీ ఆడిటోరియంలో మిల్లెట్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (డీడీఎస్) సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం జరిగిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు.చిరుధాన్యాలపై అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న సామాజిక కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘క్లైమెట్ ఛేంజ్, మిల్లెట్స్, ఎకోసిస్టమ్ సర్వీసెస్’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టికి రామాంజనేయులు సమన్వయకర్తగా వ్యవహరించారు. రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు 30 ఏళ్ల నాడు పాలకులు ఏర్పాటు చేసిన మద్దతు వ్యవస్థలు ఇప్పటి సవాళ్లను ఎదుర్కోవటానికి పనికిరావని, కొత్త తరహా మద్దతు వ్యవస్థలను అమల్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని డా. రామాంజనేయులు సూచించారు. రైతుబంధు వంటి పథకాలను కొత్త సవాళ్ల వెలుగులో సమీక్షించుకోవాలన్నారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలిపర్యావరణ సేవలకు చెల్లింపులు అవసరం అజిమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ అధ్యాపకురాలు డాక్టర్ మంజుల మేనన్ మాట్లాడుతూ.. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా ప్రకృతి/ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి మిశ్రమ పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వాలు అండగా నిలవాలన్నారు. వారు ప్రభుత్వం నుంచి ఎరువులకు సంబంధించి ఎటువంటి సబ్సిడీలు పొందటం లేదు. ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతి వల్ల పర్యావరణానికి, సమాజానికి ఎన్నో విధాలుగా ప్రయోజనం ఒనగూడుతున్నది. ఈ పర్యావరణ సేవలకు గుర్తింపుగా ఈ రైతులకు ప్రత్యేక చెల్లింపులు చేయాల్సిన అవసరం ఉందని మంజుల సూచించారు.ఇది కొత్త భావన కాదని, ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నదేనన్నారు. డీడీఎస్ మాదిరి రసాయన రహిత జీవవైవిధ్య సాగు వల్ల భూసారాన్ని పెంపొందించటం, సాగు నీరు ఆదా అవుతుంది, పోషక విలువలతో కూడిన ఆహారం ప్రజలకు అందుతుంది కాబట్టి ఈ రైతులకు ప్రత్యేక మద్దతు వ్యవస్థను నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల్లో 6% అదనపు నిధులతోనే ఈ మద్దతు వ్యవస్థను అందుబాలోకి తేవచ్చని తమ అధ్యయనంలో వెల్లడైందని మంజుల అన్నారు. రైతులు ఎందుకు నష్టపోవాలి?సీనియర్ పాత్రికేయుడు డాక్టర్ కెవి కూర్మనాధ్ మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల రైతులకు ఎదురవుతున్న సరికొత్త సమస్యలను పాలకులు గుర్తించకపోవటం విడ్డూరంగా ఉందన్నారు. కుండపోత వర్షాలు, అకాల వర్షాల వల్ల పత్తి, ధాన్యంలో అధిక మోతాదులో తేమ ఉంటే అందుకు రైతులు ఎందుకు నష్టపోవాలని ప్రశ్నించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో నిబంధనలు సడలించి రైతులకు అండగా నిలవాల్సిన అవసరాన్ని ప్రభుత్వం ఎందుకు గుర్తెరగటం లేదన్నారు.చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలిరైతు స్వరాజ్య వేదిక నేత కన్నెగంటి రవి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటైన తర్వాత మద్దతు ధర, సేకరణ సదుపాయాల్లేక రాష్ట్రంలో చిరుధాన్యాల సాగు మరింత దిగజారిందన్నారు. అధిక బ్యాంకు రుణాలు పొందటం కోసం చిరుధాన్యాలు సాగు చేసే రైతులు కూడా తాము పత్తి, వరి వంటి పంటలు సాగు చేస్తున్నామని అధికారులతో చెబుతున్నారని, అందుకే చిరుధాన్యాల వాస్తవ సాగు విస్తీర్ణం కూడా గణాంకాల్లో ప్రతిఫలించటం లేదన్నారు. అత్యంత కాలుష్యానికి కారణమయ్యే ఇథనాల్ పరిశ్రమలు మరో 30 రాష్ట్రంలో రానున్నాయని, వీటికి ముడిసరుకు అందించటం కోసమే ప్రభుత్వం వరి సాగును ప్రత్యేక బోనస్ ప్రకటించి మరీ ప్రోత్సహిస్తున్నదన్నారు. మూడు చిరుధాన్య పంటలకు మద్దతు ధర ప్రకటించినా, జొన్నలను మాత్రమే కోర్టు ఆదేశించినప్పుడే ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేదుకు ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని రవి కోరారు. -
ఇక్కడ డీల్ కుదిరింది.. అక్కడ వేలు తెగింది
సాక్షి ప్రతినిధి, గుంటూరు/ గుంటూరు రూరల్ : ఈ చిత్రం చూశారుగా.. సోమవారం ఢిల్లీలో వేలు కోసుకొని హడావుడి చేసిన గుంటూరు స్వర్ణభారతి నగర్‌కు చెందిన కోపూరి లక్ష్మి టీడీపీ నేత బూర్ల రామాంజనేయులుతో ఉన్న చిత్రమిది. కొన్నేళ్లుగా తాడేపల్లిలో ఉంటున్న లక్ష్మి ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు, వేమూరు టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబుతో కలిసి ఆ పార్టీలో పనిచేస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా 2014 నుంచి 2017 మధ్య గుంటూరు, పరిసర ప్రాంతాల్లో చాలా భూ దందాలు, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేయడాలు, కేసులు పెట్టిన వారిపై అనుచరులతో కలిసి దాడులు చేయడంలో పేరొందిన ‘ఆదర్శ’ మహిళ. ఢిల్లీ డ్రామాలో నాయిక. లక్ష్మి తల్లి, తండ్రిది కూడా భూ దందాల చరిత్రే. ఆమె తండ్రి కూడా చేతులు కోసుకొని, కళ్లు పొడుచుకొని అధికారులను బెదిరించి, పనులు చేయించుకొనే వాడు. వారి మరణానంతరం వారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకొంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో గుంటూరు, పరిసర ప్రాంతాల్లో లక్ష్మి చేసిన దందాలు అన్నీ ఇన్నీ కావు. ఆమెపై గుంటూరులో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో ఆమె తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి బయట పడేందుకు ఆ పార్టీలో చేరింది. ఆమె కోరుకున్నట్లుగానే కేసులు, దర్యాప్తులు ఆగాయి. ఇప్పుడు ఇదే కోపూరి లక్ష్మిని పావుగా వాడుకొని వైఎస్సార్సీపీకి చెందిన దళిత నేతలపై ఆరోపణలు చేయించి, తద్వారా ఎన్నికల్లో ఎంతో కొంత లబ్ధి పొందాలన్న చవకబారు ఆలోచనతో టీడీపీ భారీ పథకమే రచించింది. భూ అక్రమాలకు పాల్పడిన అమె చేతే, వేరే వారెవరో అక్రమాలు చేస్తుంటే అడ్డుకొన్నానంటూ చెప్పించడం వెనుక ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయం ఆమె ఢిల్లీ వెళ్లి ఆడిన డ్రామాలోనే తేటతెల్లమైంది. అంతలోనే ఇంత పెద్ద స్పందనా? కోపూరి లక్ష్మి ఇలా ఢిల్లీలో వేలు కోసుకొన్నానని చెప్పిందో లేదో.. కొద్ది నిమిషాల్లోనే టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఆమె ఢిల్లీలో ఆడిన డ్రామా వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు. ఒకాయన వేలు కోసుకోవద్దు.. ఓటేయండంటాడు. ఇంకొకాయన మరో రకంగా ఓదారుస్తాడు. అసలు వేలు కోయించిన వాళ్లే క్షణాల్లో ఇలా ఓదార్పు మాటలు మాట్లాడటం విడ్డూరమే. కేసుల ఎత్తివేత హామీ, ప్రలోభాలు ఎవరైనా తనపై దాడులు జరిగినా, వేధింపులకు గురిచేసినా ముందుగా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. తనను కొంతమంది వేధిస్తున్నారంటూ ఆరేళ్ల కిందట టీడీపీ ప్రభుత్వంలోనే కేసులు పెట్టింది. తర్వాత గుంటూరు నుంచి తాడేపల్లి వెళ్లిపోయింది. ఇటీవలి కాలంలో ఆమెపై ఎప్పుడు దాడులు జరిగాయి, వాటిని ఎవరు చేశారో తెలియదు. ఆమె ఫిర్యాదు కూడా చేయలేదు. ఢిల్లీలో విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో కూడా 2018 నాటి కేసుల గురించే ప్రస్తావించింది. టీడీపీ నేతల అండ, ఆర్థిక సహకారంతో ఏకంగా ఢిల్లీ వెళ్లి, తనపై వైఎస్సార్సీపీ నేతల దాడులంటూ ఆరోపణలకు దిగింది. ఇందుకు చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ నేతలు పెద్ద స్క్రిప్టే తయారు చేశారు. ఆమెతో భారీ డీల్ కుదుర్చుకున్నారు. ఆమెపై ఉన్న కేసులు ఎత్తేస్తామని, ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రలోభాలకు గురి చేశారు. ఈ డీల్ కుదిరిన వెంటనే ఆమె ఢిల్లీ వెళ్లి, ఎల్లో స్క్రిప్టు ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై ఆరోపణలు చేసి, వేలు కోసుకొన్నానని చెప్పి డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. టీడీపీ పెద్దల అండ లేనిదే ఆమె ఇంత దూరం వెళ్లదన్న విషయం ఇక్కడ సుస్పష్టం. ఆమె ఢిల్లీ నుంచి రాగానే నేరుగా టీడీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి మీడియా ముందు పెట్టడమూ ఎల్లో స్క్రిప్టు ఉందన్న విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. లక్ష్మి గతమంతా అక్రమాలే స్వర్ణ భారతి నగర్‌కు చెందిన నామాల కృష్ణమూర్తి, భార్య తులసమ్మ 25 ఏళ్ళ కిందట స్వర్ణభారతి నగర్లో ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసి, వాటిలో ప్లాట్లు వేసి ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమాయక ప్రజలకు అంటగట్టేవారు. ఆ కాలనీకి ఇద్దరి పేర్లు కలిసేలా కృష్ణతులసీ నగర్ అనే పేరు వారే పెట్టారు. నామాల కృష్ణమూర్తి కూడా 25 ఏళ్ళ క్రితం ఇదే విధంగా చేతులు కోసుకుని, కళ్ళు పొడుచుకుని అధికారులను బెదిరించి పనులు చేయించుకునేవాడని కాలనీవాసులే చెబుతున్నారు. వారి కుమార్తే కోపూరి లక్ష్మి. వారి మరణానంతరం తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకుని స్వర్ణభారతి నగర్, కృష్ణతులసీ నగర్, అడవితక్కెళ్ళపాడు, తుఫాన్ నగర్లలో ఇదే విధంగా బ్లాక్మెయిల్, స్థలాల కబ్జాలకు పాల్పడుతుండేదని, ఫోర్జరీ పత్రాలతో వేరొకరి స్థలాలు అమ్మేస్తుండేదని స్థానికులు చెబుతున్నారు. ఆమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ కేసులన్నీ అప్పటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే నమోదయ్యాయి. చాలా కేసులు కోర్టులో విచారణలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. వాటిలో కొన్ని.. ♦ 2013లో స్వర్ణభారతి నగర్‌కు చెందిన దివ్యభారతి అనే మహిళకు చెందిన స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి, అందులో తహసీల్దారు సంతకం సైతం ఫోర్జరీ చేసి, ఆ స్థలం తనదేనని స్థానికంగా ఉండే పద్మశ్రీ అనే మహిళకు విక్రయించింది. విషయం తెలుసుకున్న దివ్యభారతి కోపూరి లక్ష్మిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోర్జరీ, నకిలీ పత్రాలు తయారీ తదితర విషయాలపై కేసు నమోదు చేశారు. 2016లో ఈ కేసు విషయమై కోర్టు నుంచి ఇంటికి వస్తున్న పద్మశ్రీ కుటుంబ సభ్యులను స్వర్ణభారతినగర్ సమీపంలో అడ్డగించి వారిపై కోపూరి లక్ష్మి, ఆమె అనుచరులు దాడిచేశారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా లక్ష్మిపై కేసు నమోదు చే«శారు. ♦కోపూరి లక్ష్మి నకిలీ ఫోర్జరీ బీఫారాలను తయారు చేసి, అందులో తనకు తెలియకుండానే తన పేరిట సాక్షి సంతకాలు చేసేదని స్వర్ణభారతి నగర్‌కు చెందిన రమాదేవి అనే మహిళ 2013లో నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. ♦2014లో సుశీల, అంజలి అనే మహిళల ఇళ్ళను కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి ప్రయత్నించింది. వారిపై దాడి చేసి ఇరువురి ఇళ్ళకు ఫోర్జరీ సంతకాలతో నకిలీ బీఫారాలు తయారు చేసి స్థానికంగా ఉండే వ్యక్తికి విక్రయించాలని ప్రయత్నించింది. దీంతో లక్ష్మిపై సుశీల నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ♦ 2015లో కోపూరి లక్ష్మి తన 15 సంవత్సరాల పెద్ద కుమార్తెకు వివాహం కాకున్నా, అప్పటికే వివాహం జరిగిందని రెవెన్యూ అధికారులను నమ్మించి ఆమె పేరుతో బీఫారం సృష్టించి ఆ స్థలాన్ని వేరే వ్యక్తికి విక్రయించాలని చూసింది. ఈ మోసాన్ని గమనించిన ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ♦ 2017లో నకిలీ పత్రాలతో మోహనరావు అనే వ్యక్తికి ఇంటి స్థలం విక్రయించింది. అయితే, ఈ స్థలాల దస్తావేజులు నకిలీవని తేలడంతో ఆయన నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ కేసుల్లో పోలీసులు లక్ష్మిని పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆమె పోలీసులను సైతం ఏమార్చి స్టేషన్ నుంచి పారిపోయిన సంఘటనలు ఉన్నాయని పోలీసులే చెబుతున్నారు. మా స్థలానికి నకిలీ బీఫారం సృష్టించి అమ్మేసింది 2016లో నా కుమార్తె అనారోగ్యంతో ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స కోసం వెళ్లేదాన్ని. ఆ క్రమంలో కోపూరి లక్ష్మి మా ఇంటి స్థలానికి నకిలీ బీఫారాన్ని సృష్టించి వేరేవారికి అమ్మేసింది. అదేమని అడిగితే మాపై దాడి చేసింది. దీంతో మనస్థాపానికి గురైన మా కుమార్తె చనిపోయింది. తరువాత పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి లక్ష్మి నకిలీ బీఫారం సృష్టించిందని రూజువు చేసి మా ఇల్లు మేము కాపాడుకున్నాం. – పాకనాటి ఆరోగ్యం, భర్త నాగేశ్వరరావు, కృష్ణతులసీ నగర్ మా స్థలం కబ్జాకు ప్రయత్నించింది.. మమ్మల్ని బెదిరించింది మా ఇంటి స్థలాన్ని కబ్జా చేసేందుకు కోపూరి లక్ష్మి తీవ్రంగా ప్రయత్నించింది. మమ్మల్ని బెదిరించింది. మేము పదేళ్ళ క్రితం రైతుబజారులో కూలీ పనులు చేసుకునేవాళ్లం. స్వర్ణభారతి నగర్లో మా స్థలం ఖాళీగా ఉండేది, దానిని కబ్జా చేసి విక్రయించాలని చూసింది. పోలీసులు, స్థానిక నాయకుల సహకారంతో అతి కష్టం మీద మా స్థలాన్ని కాపాడుకున్నాం. అప్పటి నుంచి మాపై పలుమార్లు దాడులు చేయించింది. లక్ష్మి మనుషులు ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. – పుష్పలత, స్వర్ణభారతి నగర్ నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది మేము వ్యవసాయ కూలీలం. పనులు ఉన్న సమయంలో ఇతర గ్రామాలకు వెళ్ళి కూలీ చేసి, వేసవిలో సొంత ఇంటికి వచ్చే వాళ్లం. మేము లేని సమయంలో కృష్ణతులసీ నగర్‌లోని మా ఇంటిని కబ్జాచేసి నకిలీ బీఫారాన్ని సృష్టించి అమ్మేసింది. దీంతో పోలీసులను ఆశ్రయించాం. లక్ష్మి తన మనుషులతో మాపై దాడులు చేయించింది. చంపుతామని బెదిరించింది. రెవెన్యూ అధికారులు, పోలీసులు, స్థానిక నాయకుల సాయంతో తిప్పలుపడి మా స్థలాన్ని కాపాడుకున్నాం. – పులిపాటి అంజలి, భర్త లోకయ్య, కృష్ణతులసీ నగర్ అక్రమాలకు అడ్డుపడుతున్నామని కేసు పెట్టింది కోపూరి లక్ష్మి స్థలాల ఆక్రమణలను అడ్డుకున్నందుకు నాపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది. అదేమని అడిగితే పోక్సో కేసు పెడతానని, నన్ను చంపేస్తానని బెదిరించింది. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి నా నుంచి లక్షల్లో డబ్బు వసూలు చేసింది. ఆమె బాధలు పడలేక హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నాను. – కె మోహనరావు, స్వర్ణభారతి నగర్ జాతీయ మీడియా దృష్టినాకర్షించడానికే ఢిల్లీకి కోపూరి లక్ష్మికి నిజంగా అన్యాయం జరిగితే ఇదే పని గుంటూరులోనో, తాడేపల్లిలోనో చేయొచ్చు కదా! ఢిల్లీ వరకు ఎందుకు వెళ్లారు? ఇక్కడ మళ్లీ చంద్రబాబు పాత్రే కనపడుతుంది. 1994 నుంచి ఆయన ఆడుతున్న పాత చీప్‌ట్రిక్స్‌నే ఇక్కడా ప్రయోగించారు. అవే గుంటనక్క వేషాలు ప్రదర్శించారు. రాష్ట్రంలో అయితే, ఆమెను నమ్మే వారెవరూ ఉండరు. ఆమె అక్రమాల చరిత్ర అటువంటిది. అదే ఢిల్లీలో అయితే ఎల్లో మీడియాతోపాటు జాతీయ మీడియా దృష్టిని, కొందరు జాతీయ నేతల దృష్టిని ఆకర్షించొచ్చు. అందుకే చంద్రబాబు ఇలాంటి చవకబారు డ్రామాకు తెరతీశారు. -
ప్రత్తిపాడులో టీడీపీ గూండాయిజం
గుంటూరు రూరల్: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్తి బూర్ల రామాంజనేయులు వైఎస్సార్సీపీ అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్ ఇంటిపై స్వయంగా దాడికి తెగబడ్డారు. బుధవారం మధ్యాహ్నం కార్లు, ఇతర వాహనాలపై 200 మంది టీడీపీ, జనసేన రౌడీలతో, మారణాయుధాలతో వచ్చి రామాంజనేయులు ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న వారిని కార్లతో తొక్కించే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో పలాయనం చిత్తగించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. మాజీ ఐఏఎస్ అధికారి అయిన రామాంజనేయులే ఓ గూండా మాదిరిగా ఇలా దాడికి పాల్పడటం అందరినీ విస్మయ పరిచింది. టీడీపీ గుండాయిజాన్ని తేటతెల్లం చేసింది. ఓడిపోతామన్న అక్కసుతోనే రామాంజనేయులు ఇలా దాడి చేసి, భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నించారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. వారిపై పోలీసులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అభ్యర్థి బలసాని కిరణ్‌కుమార్, వైఎస్సార్సీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయలు ఓ పథకం ప్రకారం కర్రలు, రాడ్లు, ఇతర మారణాయుధాలతో 20 కార్లు, ఇతర వాహనాలతో రౌడీమూకలను తీసుకొని గుంటూరు నగరం జేకేసీ కళాశాల రోడ్డులోని వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కిరణ్‌కుమార్ కారు డ్రైవర్లు, వైఎస్సార్సీపీ నాయకులు ఎవరు మీరు ఎందుకు వచ్చారని అడగ్గా, టీడీపీ రౌడీ మూకలు వారిపై ఒక్కసారిగా దాడికి దిగారు. కారులోనే ఉన్న టీడీపీ అభ్యర్థి రామాంజనేయులు కొట్టండిరా వాళ్లను అంటూ రౌడీ మూకలను రెచ్చగొట్టాడు. దీంతో వారు రెచ్చిపోయి అభ్యర్థి బలసానిని, కార్యకర్తలను కులం పేరుతో దుర్భాషలాడుతూ దాడులకు దిగారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎదురు దాడికి దిగటంతో టీడీపీ, జనసేన రౌడీ మూకలు కార్లు వెనక్కి తిప్పుకొని పారిపోయారు. కిరణ్‌కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు చేతికి తీవ్రగాయమైంది. గోరంట్లకు చెందిన తాళ్ళ అబ్బులును రౌడీ మూకలు కిందపడేసి కొట్టడంతో ఆయనకు గాయాలయ్యాయి. వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెట్టు వెంకటప్పారెడ్డి కాళ్ళ పైకి రామాంజనేయులు తన కారు ఎక్కించి, తొక్కించడంతో ఆయన కాలు విరిగింది.అసభ్య పదజాలంతో, కులం పేరుతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని కిరణ్‌కుమార్ డ్రైవర్ ఇంద్రబాబు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ నరేష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో టీడీపీ వారు కూడా అక్కడికి రావడంతో పోలీసు స్టేషన్ వద్ద కూడా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ అంశంపై జిల్లా ఎస్పీ తుషార్ డూడీకి ప్రత్తిపాడు వైఎస్సార్సీపీ అభ్యర్థి కిరణ్‌కుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి కిలారు రోశయ్య, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, గుంటూరు తూర్పు అభ్యర్థి షేక్ నూరీఫాతిమా, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ లాల్పురం రాము ఫిర్యాదు చేశారు. రాళ్ళతో దాడిచేస్తూ వచ్చారు కార్యాలయం వద్ద కింద నాతోపాటు మరో పది మంది కార్యకర్తలు భోజనం చేసేందుకు ఉపక్రమిస్తున్నాం. ఒకేసారి సుమారు 20 కార్లు ఇంటి ముందుకు వచ్చి ఆగాయి. వెంటనే కార్లలో నుంచి దిగిన టీడీపీ గూండాలు ఇంటిపైకి రాళ్ళు రువ్వుతూ ఎవరున్నారు లోపల బయటకు రాండిరా అంటూ దుర్భాషకు దిగారు. వెంటనే నేను, కార్యకర్తలు వారి వద్దకు వెళ్ళి ఎవరు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించాం. కారులో ఉన్న టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు దుర్భాషలాడుతూ తనతో వచ్చిన రౌడీ మూకలతో వెయ్యండ్రా వీళ్ళని అని అరిచాడు. వెంటనే రౌడీ మూకలు మాపై దాడికి దిగారు. ఇంటివద్దకే వచ్చి చంపుతాం.. అంటూ రౌడీ మూకలు అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. దాడిలో నా చేతికి గాయమైంది. – ఇంద్రబాబు, కిరణ్‌కుమార్ డ్రైవర్ కారు ఎక్కించి తొక్కెయ్యిరా వాడిని అని రామాంజనేయులు అన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటిపై రాళ్ళతో, రౌడీలతో దాడికి పాల్పడుతున్నావ్.. ఇదేనా నీ సంస్కారం అంటూ నేను గట్టిగా నిలదీశాను. నేను, ఇతర వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం రామాంజనేయులుతో వచ్చిన రౌడీ మూకలపై ఎదురు దాడికి దిగాం. దీంతో రామాంజనేయులు తన కారుతో వాళ్ళను తొక్కెయ్యమని డ్రైవర్‌కు చెప్పాడు. కారును ఒక్కసారిగా ముందుకు వెనక్కు కదపటంతో కారు టైరు నా ఎడమ కాలుపై ఎక్కింది. కాలు పాదం వద్ద ఫ్యాక్చర్ అయ్యింది. కారుతో తొక్కించి మమ్మల్ని అంతం చేయాలని బూర్ల రామాంజనేయులు ప్రయత్నించాడు. – మెట్టు వెంకటప్పారెడ్డి, వైఎస్సార్సీపీ సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విచక్షణరహితంగా దాడి టీడీపీ రౌడీలు దాడికి దిగటంతో మమ్మల్ని మేం కాపాడుకునేందుకు ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో నన్ను, నాతోపాటు ఉన్న ఆర్ అండ్ బీ డైరెక్టర్ పిల్లి మేరిని సైతం రామాంజనేయులే స్వయంగా చేతులతో నెట్టి కిందపడేశాడు. ఆడ మనిషి అని కూడా చూడకుండా రౌడీ మూకలు మేరిపై దాడి చేశారు. నన్ను కొట్టారు. వెంటనే మేము లేచి ఎదురు దాడికి ప్రయత్నించాం. దీంతో మమ్మల్ని కార్లతో తొక్కించే ప్రయత్నం చేసి పరారయ్యారు. – తాళ్ళ అబ్బులు, వైఎస్సార్సీపీ కార్యకర్త -
నరసరావుపేట కిడ్నాప్ కేసు విషాదాంతం
సాక్షి, పల్నాడు జిల్లా: నరసరావుపేటలో కిడ్నాప్ కేసు విషాదాంతమైంది. కిడ్నాప్ అయిన రామాంజనేయులు హత్యకు గురయ్యాడు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలలో రామాంజనేయులు మృతదేహం లభ్యమైంది. రామాంజనేయుల్ని చంపిన దుండగులు మృతదేహాన్ని గోనె సంచిలో మూటగట్టి హైవేలో ఓ బ్రిడ్జి కింద పడేశారు. కళ్యాణ్ జ్యువలరీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్న రామాంజనేయుల్ని కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని వెళ్లారు. కిడ్నాప్ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అయితే బాజీ, అన్నవరపు కిషోర్లే తన భర్తను చంపారని రామాంజనేయులు భార్య ఆరోపిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రామాంజనేయులు కిడ్నాప్ ఉపయోగించిన ఆటోను గుర్తించిన పోలీసులు సీసీ కెమెరాలను విజువల్స్ ద్వారా మొత్తం ఐదుగురు కిడ్నాప్‌కు పాల్పడినట్టు భావిస్తున్నారు. కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
బీజేపీ నేత అంజిబాబు పార్టీ నుంచి సస్పెండ్
సాక్షి, విజయవాడ: మద్యం అక్రమంగా తరలిస్తూ అడ్డంగా దొరికిపోయిన బీజేపీ నేత గుడివాక రామాంజనేయులు అలియాస్ అంజిబాబుపై ఆ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రామాంజనేయుల్ని బీజేపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పార్టీ నేతలు అక్రమ కార్యకలాపాలు, సంఘ విద్రోహ చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించదని, రామాంజనేయులు వ్యవహరంలో పార్టీ క్రమశిక్షణ సంఘం ఆధ్వర్యంలో తదుపరి చర్యలు కొనసాగుతాయని ఆ పార్టీ పేర్కొంది. కాగా 2019 ఎన్నికల్లో రామాంజనేయులు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బీజేపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా ఆయన దొరికిపోయారు. గుంటూరు ఏఈఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిపిన దాడుల్లో రామాంజనేయులు రూ.6 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌తో పట్టుబడ్డారు. ఆయనతో పాటు సురేశ్, నరేశ్ అనే ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. (మద్యం అక్రమ రవాణా: బీజేపీ నేత అరెస్ట్) ఇక ఇటీవల కాలంలో ఏపీ బీజేపీ నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సస్పెన్షన్ వేటుకు గురవుతున్న విషయం తెలిసిందే. పార్టీ నిబంధనలకు విరుద్దంగా మాట్లాడిన వెలగపూడి గోపాలకృష్ణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బీజేపీ వైఖరి గందరగోళంగా ఉందని వ్యాసం రాసిన బీజేపీ నేత, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు, డాక్టర్ ఓవీ రమణను ఇదివరకే బీజేపీ సస్పెండ్ చేసింది. -
సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పై సస్పెన్షన్ వేటు
-
సీపీఎస్ సంఘ నేత రామాంజనేయులు యాదవ్ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్)ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్న సీపీఎస్ ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. పదవీవిరమణ అనంతరం తమ బతుకులను రోడ్డు పాలుచేస్తున్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని పోరాడుతున్న సీపీఎస్ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాలెల రామాంజనేయులు యాదవ్‌ను ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు అనంతపురం జిల్లా విద్యాధికారి ద్వారా హడావుడిగా ఉత్తర్వులు జారీ చేయించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీకి చెందిన వ్యక్తులు కొందరి చేత ‘సీవిజిల్’ ద్వారా ఫిర్యాదు చేయించి బీసీ నాయకుడైన రామాంజనేయులు యాదవ్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. ఈయన అనంతపురం జిల్లా తనకళ్లు మండలం బొంతలపల్లి జడ్పీ హైస్కూల్లో హిందీపండిట్‌గా పనిచేస్తున్నారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నా ఉద్యోగులకు న్యాయం చేయడం లేదు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే సీపీఎస్‌ను రద్దు చేస్తామని కర్నూలు జిల్లా ఆదోనిలో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. దీనిపై రామాంజనేయులు యాదవ్ హర్షం వ్యక్తం చేయడంతో కక్ష కట్టిన ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయించింది. అశోక్‌బాబుకో రూలు.. మాకో రూలా? ‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు మేలు చేసే మాట వైఎస్ జగన్ చెబితే అభినందించాను. అంత మాత్రాన నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారా? మరి గతంలో అశోక్‌బాబు ఏకంగా చంద్రబాబుకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలోనే పాల్గొన్నారే.. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయలేదు. ఆయనకో రూలు.. బీసీ సామాజిక వర్గానికి చెందిన మాకో రూలా?’ అని ఏపీ సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. ఉద్యోగుల హక్కులను అణగదొక్కడమే... సీపీఎస్ రద్దుపై తన అభిప్రాయాన్ని మీడియాతో పంచుకున్నందుకు తనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం ఉద్యోగుల హక్కులను, అభిప్రాయాల వ్యక్తీకరణను, ఉద్యమాలను అణగదొక్కడమేనని రామాంజనేయులు యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెనకబడిన కులాలకు చెందిన వ్యక్తులను అవమానించడమేనని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, ఒక ఉద్యమ నేతగా తన అభిప్రాయాన్ని చెప్పినందుకు చర్యలు తీసుకోవడం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయమని ఖండించారు. చంద్రబాబుకు గుణపాఠం తప్పదు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండు చేసిన పాపానికి రామాంజనేయులు యాదవ్‌ను సస్పెండ్ చేయడాన్ని నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్స్ జాతీయ అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తీవ్రంగా ఖండించారు. -
అన్నం పెట్టే చెయ్యి!
ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలంటే మనిషిలో ఏం ఉండాలి? చేతినిండా డబ్బా? కాదు... మనసు నిండా ఆర్ద్రత? నిజమే... అంతగా స్పందించే మనసు ఉన్నప్పుడే ఇలాంటి సేవ సాధ్యం. ఇందుకు నిదర్శనమే రామాంజనేయులు. పెద్ద మనసు అది గుంటూరు జల్లా, నిజాం పట్నం మండలంలోని అడవుల దీవి గ్రామం. అన్ని గ్రామాల్లో జరిగినట్లే అడవుల దీవిలో కూడా పండుగలు, పర్వదినాల్లో దేవాలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానాలు జరిగేవి. ఆ అన్నదానాల సమయంలో వృద్ధులు, అనాథలు, దిక్కులేని వాళ్లు భోజనాల కోసం బారులుదీరేవారు. ఆ సంఘటన యేమినేని రామాంజనేయులిని కలచి వేసింది. పంటలు పండించి పదిమందికి అన్నం పెట్టే పల్లెలో కూడా ఇంతమంది అన్నం లేని వాళ్లు ఉన్నారా అని మధనపడ్డాడు. వయసుడిగిన వాళ్లు వేళకు అన్నం తినకపోతే సొమ్మసిల్లి పోయేటట్లు కనిపించారు. వారికి ఆ ఎండలు తగ్గే వరకు రోజుకు కనీసం ఒక్కపూటైనా కడుపునిండా అన్నం పెట్టగలిగితే అని ఆలోచించాడు. మొదట ఇరవై మంది వచ్చేవారు, ఇప్పుడు రోజూ 75 మంది భోజనం చేస్తున్నారు. భోజనం చేసి వెళ్తూ... ‘‘చల్లంగుండయ్యా...మా కోసమే ఆ దేవుడు నిన్ను పంపిండు’’ అని వృద్ధులు దీవిస్తున్నారు. చిన్న ఆలోచన! ఎండాకాలం రెణ్నెల్ల కోసం గత ఏడాది వేసవిలో మొదలైంది. ఇప్పటికీ కొనసాగుతోంది. ఒక మంచి పని మొదలు పెట్టావు, ఆపవద్దంటూ రామాంజనేయులుకు ఊరివారంతా అండగా నిలిచారు. బతికినన్నాళ్లూ కాయకష్టం చేసి పిల్లల్ని పెంచి పెద్దచేసిన వారికి, వృద్ధాప్యంలో తిండి కోసం ఎదురు చూసే పరిస్థితి రాకూడదని, ఈ మంచిపనిని కొనసాగిద్దామని ముందుకొచ్చారు. కమిటీగా ఏర్పడి పనిచేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఏడాదంతా పని దొరకడం కష్టం. ఏడాదిలో కొన్నాళ్లపాటు ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. కుటుంబాల్లో వృద్ధులు ఇంటిని కనిపెట్టుకుని కొడుకు, కోడళ్లు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ రోజులు వెళ్లదీస్తుంటారు. కొందరి పిల్లలు ఊళ్లో ఉండి కూడా ముసలి వాళ్లకు తిండి పెట్టరు. ఆ పండుటాకులకు రామాంజనేయులు అన్నం పెట్టే దేవుడయ్యాడు. పండని పొలంతో కష్టాలు! ‘‘మాకు తీరప్రాంతంలో పొలం ఉంది. పంటకు పనికిరాని పొలం. మా అమ్మనాన్నలు సాంబశివరావు, శివకుమారి. మా అక్కయ్య, తమ్ముడు, నేను... ముగ్గురం పిల్లలం. మమ్మల్ని చదివించటానికి వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు. బడ్డీ్డ కొట్టు పెట్టుకుని మమ్మల్ని డిగ్రీ వరకు చదించారు. అక్కకు పెళ్లి చేశారు. అంతటి కష్టంలో ఉన్నప్పుడు కూడా మనకున్నదాంట్లోనే పదిమందికి సాయం చేయాలని చెప్పేవాళ్లు’’ ఆ మాటలే తనను నడిపించాయంటాడు రామాంజనేయులు. అతడి చొరవతో ఇప్పుడు అడవుల దీవిలో అనాథలు, వృద్ధులు ఎవరూ ఆకలి కడుపుతో పడుకోవడం లేదు. – గడ్డం వాసు, సాక్షి, రేపల్లె సంపాదనలో కొంత! పదేళ్ల కిందట డిగ్రీపట్టాతో హైదరాబాద్ వెళ్లాను. సేల్స్ ప్రమోటర్, షాపింగ్ మాల్ సుపర్‌వైజర్‌గా చేశాను. ఉద్యోగం చేస్తూండగానే సినిమా రంగంతో పరిచయమైంది. పాటలు రాసే అవకాశాలు వస్తుండటంతో ఉద్యోగం మానేశాను. నా సంపాదనతో అంతమంది ఆకలి తీర్చడం సంతోషంగా ఉంది. ఆ డబ్బు మిగుల్చుకుంటే నేను ఖరీదైన చొక్కా వేసుకుంటానేమో, ఇంకా సంపాదిస్తే పెద్ద కారులో తిరుగుతానేమో. అవేవీ ఇలాంటి సంతోషానికి సాటిరావు’’ – యేమినేని రామాంజనేయులు అంతటి భాగ్యం దక్కింది! మహత్తర కార్యక్రమంలో సేవ చేసే భాగ్యం దక్కటం ఆనందంగా ఉంది. ప్రతి రోజూ ఇంటి వద్ద భోజనాలు తయారు చేయించి వృద్ధులు, అనాథలకు పెడుతున్నాం. – పాటిబండ సాయిబాబు, కమిటీ ఉపాధ్యక్షుడు కడుపునింతా తింటున్నా! కష్టపడానికి ఓపిక లేదు. ఉండటానికి ఇల్లు లేదు. మతిస్థిమితం లేని మూగ చెల్లెలిని బంధులకు అప్పగించాను. నేను కూడా వెళ్తే వాళ్లకు భారమని వెళ్లలేదు. కానీ తిండి కోసం చాలా బాధపడేవాడ్ని. పోయిన సంవత్సరం ఆ బాబు మధాహ్నం భోజనం పెట్టటం మొదలు పెట్టాక కడుపునిండా భోజనం దొరుకుతోంది. ఆ బాబు చల్లగ ఉండాలి. – పి.రాజారావు నా బిడ్డలు వచ్చే వరకు ఇక్కడే! బిడ్డలు ఇక్కడ లేరు. రోజూ వండుకుని తినాలంటే నడుము లేచేది కాదు. రోజూ ఇక్కడే తింటున్నాను. నా బిడ్డలు వచ్చే వరకు ఇక్కడే ఈ బిడ్డ దగ్గరే అన్నం తింటాను. – తోట నాగేంద్రమ్మ -
ప్రేమకు ఉరి
♦ తూర్పు గోదావరి జిల్లాలో పరువు హత్య ♦ కుమార్తెను ప్రేమించాడని తండ్రి ఘాతుకం మలికిపురం: తన కుమార్తెను ప్రేమించాడన్న కారణంతో యువకుడిని ఓ తండ్రి ఉరి బిగించి హత్య చేశాడు. సముద్ర తీరంలో మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు. కుమార్తె ప్రేమ వ్యవహారం వల్ల గ్రామంలో తన పరువు పోయిందన్న కసితో ఈ దారుణానికి ఒడిగట్టాడు. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. గొల్లపాలేనికి చెందిన కందుల విజయకుమార్ కుమార్తె బిందు మాధవి, అదే మండలంలోని గూడపల్లి పల్లిపాలెం గ్రామానికి చెందిన కానుబోయిన నూకాలరావు కుమారుడు రామాంజనేయులు (25) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రస్తుతం రామాంజనేయులు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. బిందుమాధవి అమలాపురం సమీపంలోని బట్లపాలెంలో ఓ కాలేజీలో ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది. వీరిద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు. యువతి తండ్రి విజయకుమార్ ఉపాధి నిమిత్తం కువైట్‌లో ఉంటూ ఐదు నెలల క్రితం స్వస్థలానికి వచ్చాడు. కుమార్తె ప్రేమ విషయం తెలిసి రామాంజనేయులిని పలుమార్లు హెచ్చరించినట్లు తెలిసింది. తరువాత ఆయన విదేశాలకు వెళ్లిపోయాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వీసాలో లోపం కారణంగా మళ్లీ స్వస్థలానికి తిరిగి వచ్చేశాడు. అప్పటికీ వీరి ప్రేమ వ్యవహారం కొనసాగుతుండటం చూసి ఆగ్రహానికి లోనయ్యాడు. మే 2వ తేదీ రాత్రి రామాంజనేయులిని అతడి స్నేహితులైన గుండుమేను రవికిరణ్, కైల ప్రసాద్‌ల ద్వారా పార్టీ చేసుకుందామని పిలిపించాడు. అనంతరం తన మిత్రుడు మట్టా నాగబాబుతో కలసి, రామాంజనేయులు మెడ చుట్టూ తాడుతో ఉరి బిగించి దారుణంగా హత్య చేశాడు. రామాంజనేయులు తండ్రి నూకాలరావు ఫిర్యాదు మేరకు మలికిపురం పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం విజయకుమార్, నాగబాబును అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడంతో అసలు విషయం బయటపడింది. గొల్లపాలెంలోని సముద్ర తీరంలో పాతిపెట్టిన రామాంజనేయులు మృతదేహాన్ని దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులు వెలికితీశారు. కాగా ప్రేమించిన పాపానికి ఇంత దారుణానికి ఒడిగడతారా అని రామాంజనేయులు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. నిందితులకు ఉరి శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. నిందితులపై హత్య కేసు నమోదు: తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం గొల్లపాలెంలో జరిగిన కానుబోయిన రామాంజనేయులు అదృశ్యం సంఘటనను హత్య కేసుగా నమోదు చేసినట్లు రాజోలు సీఐ క్రిస్టోఫర్ మంగళవారం తెలిపారు. తన కుమార్తెను ప్రేమించాడన్న కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడు కందుల విజయకుమార్ అంగీకరించడంతో ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు. విజయకుమార్‌తోపాటు అతడికి సహకరించిన మరో నిందితుడు మట్టా నాగబాబును అదుపులోకి తీసుకున్నామన్నారు. మరిన్ని వివరాలు సేకరించిన అనంతరం నిందితులను కోర్టుకు పంపిస్తామని వెల్లడించారు. -
గోదావరి జిల్లాలో పరువుహత్య
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే తూర్పుగోదావరి జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. తన కూతురిని ప్రేమించాడన్న కోపంతో ఓ యువకుడిని ఆమె తండ్రి హత్య చేశాడు. ఈ ఘటన కోనసీమలోని మలికిపురం మండలం గొల్లపాలెంలో వెలుగుచూసింది. గత నెల రెండోతేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రామాంజనేయులు అనే యువకుడిని విజయ్‌కుమార్ హతమార్చారు. పోలీసుల విచారణతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కరవాడ బీచ్ వద్ద ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. గత ఆరు నెలలుగా విజయ్‌కుమార్ కూతురు, రామాంజనేయులు ప్రేమించుకుంటున్ఆరు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి, ఇటీవలే రామాంజనేయులు తిరిగొచ్చాడు. అంతలోనే అతడు హత్యకు గురి కావడంతో గొల్లపాలెంలో తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఇరువర్గాల మధ్య ఘర్షణలు మొదలై పరస్పరం దాడులకు కూడా దిగారు. -
దేవత నువ్వంటూ... భక్తుడు అయ్యాడే!
‘‘అమ్మాయి నడిచే దారి తెలుసు.. ఆ అమ్మాయి మనసులోకి వెళ్లే దారి తెలీదు! తన కోసం యుద్ధం చేయడం తెలుసు.. తనతో కలసి ఏడడుగులు వేసే మార్గం తెలీదు! మౌనంగా ప్రేమించే యువకుల మనసిది’’ అంటున్నారు పాటల రచయిత వి.వి.రామాంజనేయులు. ప్రముఖ హాస్యనటుడు శ్రీనివాస్‌రెడ్డి కథానాయకుడిగా శివరాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా’. సమైక్యంగా నవ్వుకుందాం... అనేది ఉపశీర్షిక. పూర్ణ కథానాయికగా నటిస్తున్నారు. రవిచంద్ర స్వరకర్త ఈ సినిమాలోని ‘ఓ రంగుల చిలకా..’ పాటతత్వం గురించి, ఆ పాట రచయిత వి.వి.రామాంజనేయులు మాటల్లోనే.. పల్లవి: ఓ రంగుల చిలకా.. చూడే నీ యెనకా అలుపంటూ లేనీ ఈ పిల్లాడి నడకా ఓ బంగరు తళుకా.. చుట్టూ ఏం కనకా ఎక్కడికే ఆ అడుగుల చప్పుడు వినకా ప్రేమలో పడితే.. రంగులన్నీ అమ్మాయిలోనే కనిపిస్తాయి. అమ్మాయి ఎటు వెళితే, అలుపనేది లేకుండా అబ్బాయి కూడా అటు వెళతాడు. అమ్మాయి పట్టించుకోకుండా వెళ్తుంది. సాధారణంగా అడుగులు వేస్తుంటే చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు వినకుండా ఎక్కడికి వెళ్తున్నావని రాశాను. పాపం.. ఆ అమ్మాయికి మాత్రం ఏం తెలుసు? ఒకడు మౌనంగా ప్రేమిస్తున్నాడని! కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే నీ చూపుల కోసం వేచి ఉన్నాడే అన్నీ వదిలేసి.. నిన్నే వలచాడే నీ తలపుల్లోనే నిదురే మరిచాడే నాకు తెలిసినంత వరకూ.. ఓ అమాయకత్వంతో కూడిన అబ్బాయిలే ప్రేమలో పడతారు. (నవ్వుతూ..) అమాయకులే ప్రేమిస్తుంటారు. ప్రేమికుడిని పసివాడితో పోల్చడానికి కారణమదే. మా సినిమాలో హీరో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో చాలామంది అబ్బాయిలు ఏం మాట్లాడకుండా అమ్మాయిల వెనకాలే దూరంగా తిరుగుతుంటారు. పోనీ, అమ్మాయిలు వీళ్లను చూస్తారా? అంటే, ప్చ్... ఏం పట్టించుకోకుండా వెళ్తుంటారు. మనోళ్లు మాత్రం ఒక్కసారి అమ్మాయి వెనక్కి తిరిగి చూడకపోతుందా? అని ఎదురు చూపుల్లో తమ సమయాన్నంతా గడిపేస్తుంటారు. ప్రపంచంతో ఆ ప్రేమికుడికి సంబంధం లేదు. అమ్మాయే వాడి ప్రపంచం. ప్రేయసి గురించి ఆలోచిస్తూ, ఆమె కలల్లో గడిపేస్తూ నిద్ర కూడా మరిచిపోతుంటాడు. చరణం: నిన్నందరికంటే మిన్నగ చూస్తాడే నిన్నెవరేమన్నా యుద్ధం చేస్తాడే నీతో నడిచే ఆ ఏడడుగుల కోసం వేవేలడుగులైనా నడిచే ఘనుడే ఒక్కసారి ప్రేమలో పడిన తర్వాత.. ప్రేమించిన అమ్మాయిని గొప్పగా చూడడం మొదలు పెడతాడు. అతడి స్నేహితులకు, మిగతావాళ్లకు విచిత్రంగా అనిపించే అంశం ఏంటంటే.. వీడు అమ్మాయితో ఒక్క మాట కూడా మాట్లాడడు. కానీ, ఎవరైనా ఆ అమ్మాయిపై కామెంట్ చేసినా.. ఇంకేమైనా చేసినా.. గొడవకు దిగుతాడు. ఎంత భయస్తుడైనా ఆ సమయంలో యుద్ధానికి సిద్ధమవుతాడు. కొన్ని ప్రేమకథలు ఏడడుగులు (పెళ్లి వరకూ వెళ్లకుండా) వేయకుండా ఆగుతాయి. కానీ, ఎప్పటికైనా ఆ అమ్మాయితో ఏడడుగులు వేస్తాననే ఆశతో వేల మైళ్లు నడుస్తూనే ఉంటాడు. కోరస్: ఓసారిటు చూడే.. పాపం పసివాడే నువు నడిచే దారిని వదలని ప్రేమికుడే గుండె తలపుల్నే.. తెరిచి ఉంచాడే దేవత నువ్వంటూ భక్తుడు అయ్యాడే మనకు ప్రపంచంలో ఏ దారైనా తెలియకపోవచ్చు. ఏ దారి ఎక్కడికి వెళుతుందో? తెలుసుకోవడం కష్టమే. కానీ, ప్రేమించిన అమ్మాయి దారి తెలుసుకోవడం చాలా సులువు. కాలేజీకి వెళ్తుందా? ఆఫీసుకు వెళ్తుందా? అసలు ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆమె చిరునామా ఏంటి? ప్రతిరోజూ ఏ దారిలో వెళ్తుంది? అనే విషయాలను చాలా సులభంగా తెలుసుకుంటాడు. ప్రపంచంలో ఏ ప్రేమికుడైనా గాళ్ ఫ్రెండ్ వెళ్లే దారిని మాత్రం మరువడు. అమ్మాయి వచ్చినా.. రాకపోయినా.. ఆ టైమ్‌కి దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవత అనుగ్రహం కోసం ఎదురుచూసే భక్తుడిలా.. ఎప్పుడు ఆ అమ్మాయి ప్రేమిస్తుందా? అని గుండె గది తలుపులు తెరిచి ఎదురు చూస్తుంటాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి వన్ సైడ్ లవర్స్ మనకు కనిపిస్తారు. కొందరు ఆ స్టేజి నుంచి వచ్చిన వాళ్లయితే.. మరికొందరు ఆ స్టేజిలోనే ఉన్నారు. తర్వాతి తరంలో ఆ స్టేజికి వచ్చేవాళ్లు తప్పకుండా ఉంటారు. సాధారణంగా యవ్వనంలో ప్రతి ఒక్కరూ ఎవరో ఒక అమ్మాయి వెనక తిరుగుతారు. ప్రపంచంలో అందరూ తప్పకుండా తిరుగుంటారు. మోడర్న్ యుగంలో ఓ అమ్మాయిని చూడగానే వెళ్లి, ‘నిన్ను ప్రేమిస్తున్నాను’ అని ధైర్యంగా చెప్పే అబ్బాయిలకు కూడా ఏదో ఒక సమయంలో ఈ తరహా సందర్భం ఎదురయే ఉంటుంది. అటువంటి వాళ్లందరూ... ఈ పాట చూడగానే ‘నా కోసమే ఈ పాటను రాశారా?!’ అని భావించాలి. ఎక్కడ ఈ పాట వినపడినా తమకు తాము గుర్తు రావాలనే ఉద్దేశంతో రాసిన పాట ఇది. వి.వి.రామాంజనేయులు గీత రచయిత ఇంటర్వ్యూ: సత్య పులగం -
ప్రకాశం జిల్లాలో లాకప్‌డెత్!
-
ప్రకాశం జిల్లాలో లాకప్‌డెత్!
రాచర్ల(ప్రకాశం): పోలీసుల దాష్టికానికి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా రాచర్ల పోలీస్ స్టేషన్లో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండల పరిధిలోని కాలువపల్లికి చెందిన రామాంజనేయులును ఓ కేసు నిమిత్తం శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. రాత్రంతా చిత్రహింసలు చేయడంతో రామాంజనేయులు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించడానికి యత్నిస్తుండగా.. మార్గ మధ్యలో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు. పోలీసులే కొట్టి చంపి అనంతరం ఆస్పత్రికి తరలించారని ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఆస్పత్రికి తరలిస్తుండగా.. గుండెపోటుకు గురై మృతిచెందాడని వాదిస్తున్నారు. -
కష్టాలను జయించి.. కలను బతికించి..!
మేకప్‌మ్యాన్‌గా రాణిస్తున్న రామాంజనేయులు నిట్రవట్టి నుంచి ప్రస్థానం ఫిలింనగర్లో ప్రావీణ్యం పలు సినిమాల్లో అవకాశం రంగులన్నీ కలిపి..బ్రష్ పట్టుకొని..ఓ యువతికి అందంగా మేకప్ వేసే కల.. అతన్ని వెంటాడింది. వేదనకు గురిచేసింది. పుట్టు పేదరికం.. తండ్రికి కాళ్లు లేవు..కూలి పనికి వెళ్లి కుటుంబాన్ని పోషించే అమ్మ.. పెద్ద చదువులు చదివే ఆర్థిక స్థోమత లేదు.. అయినా అతనిలో ‘కల’ చావలేదు. చదువును అర్ధంతరంగా ఆపేసి ఆర్థికంగా కుదుటపడేందుకు చెప్పినపనల్లా చేశాడు. తన కలను నెరవేర్చుకునేందుకు కష్టాలను ఎదుర్కొన్నాడు. నేడు సినిమా హీరో, హీరోయిన్లకు మేకప్ వేస్తూ బిజీ ఉన్నాడు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన రామాంజనేయులు విజయగాథ ఇది.. ఆలూరు: ఆంగికం భువనం యస్య వాచకం సర్వవాజ్ఞ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికం శివం నృత్యం, నాటకం...మరేదైనా కళ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలంటే ఆంగికం, వాచకంతోపాటు ఆహార్యం(మేకప్) తప్పని సరి. పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో చేర్చేది అదే. అందుకే భరతుడు తన నాట్యశాస్త్రంలో ఆహార్యాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. అయితే నటీనటులకు, కళాకారులకు వచ్చిన పేరు వారిని అందంగా తీర్చిదిద్దిన మేకప్‌మెన్‌లకు రావడం లేదు. అయినా ఈ కళలో తమను తాము నిరూపించుకునేందకు కొందరు ఎన్నో కష్టాలు పడుతున్నారు. అలాంటి వారిలో రామాంజనేయులు ఒకరు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామానికి చెందిన తిమ్మప్ప, దేవమ్మ దంపతుల పెద్దకుమారుడు రామాంజనేయులు. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాలన్నది అతని కల. గ్రామాల్లో నాటకాలు వేసే సమయంలో..ధుర్యోధనుడు, భీముడు, అర్జునుడు, హనుమంతుడు తదితర పాత్రధారులకు మేకప్ వేసే విధానాన్ని ఆసక్తిగా గమనించే వాడు. ఎప్పటికైనా సినిమాల్లో మేకప్‌మెన్‌గా స్థిరపడాలన్నదే తన ఆశయమని గ్రామస్తులకు చెప్పేవాడు. కుటుంబం పేదరికంలో ఉండంతో హాలహర్విలో పదోతరగతి పూర్తయిన వెంటనే బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. డబ్బు కూడబెట్టేందుకు ఇంటి నిర్మాణ పనులు చేశాడు. ఖాళీ సమాయల్లో ఎవరైనా పనిచెబితే కాదనేవాడు కాదు. కొంత డబ్బు పోగయ్యాక ఫిలింనగర్ వెళ్లి అవకాశాల కోసం వేట మొదలు పెట్టాడు. అక్కడ కొందరి వద్ద మేకప్ ఎలా వేయాలో నేర్చుకున్నాడు. బుల్లితెరలో అవకాశం.. మేకప్ మెన్ తన కల అని.. పని ఇవ్వాలని అక్కడ సినీనటులను ప్రాధేయపడేవాడు. నైపుణ్యం లేకపోవడంతో వారు అందుకు నిరాకరించేవారు. నిరుత్సాహ పడకుండా బుల్లితెరలో అవకాశాలను కోసం ప్రయత్నించాడు. ప్రయత్నం గట్టిగా ఉండడంతో అతనికి అవకాశాలు వచ్చాయి. వాటిని అందిపుచ్చుకొని తన నైపుణ్యమేమిటో తేల్చిచెప్పాడు. ఇంతటితో ఆగకుండా..గుజరాత్‌కు వెళ్లి మేకప్ సంస్థలో శిక్షణ పొంది తిరిగి హైదారాబాద్‌కు వచ్చారు. జనతా గ్యారేజ్‌లో.. పనితనం ఎల్లకాలం బయటకు రాకుండా మానదు. అలాగే రామాంజనేయులు పనితనం కూడా వెలుగులోకి వచ్చింది.. గబ్బర్‌సింగ్, జనతాగ్యారేజ్ సినిమాల్లో నటీనటులకు ఇతను మేకప్ వేశారు. అలాగే తమిళ, మళియాళం సినిమాల్లోనూ నటీనటులకు మేకప్ వేసే పనిలో బిజీగా ఉన్నారు. ‘‘బతుకుదెరువు కోసం అష్ట కష్టాలు పడ్డాను. ఎన్నో రాత్రులు పస్తులతో గడిపాను. బ్రష్ పట్టుకొని మేకప్ వేస్తున్నప్పుడు ఇవ్వన్నీ మరచిపోతాను.’’ అని రామాంజనేయులు తన స్వగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. తన ‘కల’ నిజమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని.. మేకప్ కళను ప్రోత్సహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులకు చిత్రలేఖన విద్యను నేర్పించాలన్నారు. -
తనకు తానే కి డ్నాపయ్యాడు..
కలకలం రేపిన అనంతపురం జిల్లా ధర్మవరం మరమగ్గాల వ్యాపారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. వివరాలివీ.. పట్టణానికి చెందిన రామాంజనేయులును గుర్తు తెలియని వ్యక్తులు నాలుగు రోజుల క్రితం కిడ్నాప్ చేసి బంధించారు. అతడు బందీగా ఉన్న ఫొటో ఫోన్లో వాట్సాప్ ద్వారా కుటుంబసభ్యులకు అందింది. వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు...అది కట్టుకథగా తేల్చారు. చివరికి రామాంజనేయులు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. భార్య తండ్రి నుంచి నుంచి డబ్బులు వసూలు చేయటానికే ఈ మేరకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు అంగీకరించాడు. మంగళవారం సాయంత్రం జరిగే సమావేశంలో పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
రైతు ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా కోస్గి మండలం వందగల్ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామానికి చెందిన రామాంజనేయులు బుధవారం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. తన మూడెకరాల భూమిని ఇతరులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామాంజనేయులు ఆత్మహత్య చేసుకోబోయినట్టు తెలిసింది. -
అనంతలో కాల్‌మనీ కలకలం
► అప్పు కట్టలేదని టీడీపీ నేత దాడి ► మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య శింగనమల: అప్పు కట్టలేదని టీడీపీ నాయకుడు దాడి చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్లితే...అనంతపురం జిల్లా శింగనమల మండలం పెరవలి గ్రామానికి చెందిన బోయ జయరాముడు కుమారుడు రామాంజినేయులు(25) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అదే గ్రామ సర్పంచ్ సుబ్బమ్మ భర్త, టీడీపీ నాయకుడు గోరంట్ల అనంతయ్య వడ్డీ వ్యాపారం చేస్తుండటంతో పాటు చీటీలు నడుపుతుంటాడు. బోయ రామాంజినేయులు రెండేళ్ల క్రితం అనంతయ్య వద్ద రూ. 50 వేలు అప్పు తీసుకున్నాడు. గత ఏడాది అతని భార్య రోడ్డు ప్రమాదంలో వృుతి చెందడం, ఆర్థిక ఇబ్బందులు ఆధికం కావడంతో అప్పు కట్టలేకపోయాడు. దీంతో మంగళవారం ఉదయం అనంతయ్య తన ఇంటి వద్దకు రామాంజినేయులును పిలిపించి కొట్టడంతో పాటు నానా దుర్భాషలాడాడు. దీనితో తీవ్ర మనస్తాపం చెందిన రామాంజినేయులు ఇంట్లోకి వెళ్లి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతనికి రెండేళ్ల కూతురు, తల్లిదండ్రులు ఉన్నారు. -
రామాంజనేయులు ఇంటిపై ఏసీబీ దాడి
అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పీయూడీఏ) వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై శనివారం ఏసీబీ అధికారులు మరోసారి దాడి చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రామాంజనేయులు నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు నివాసంలో రూ.2 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అయితే నెలరోజుల వ్యవధిలో ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు రెండోసారి కావటం గమనార్హం. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
బ్రహ్మసముద్రం: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. రామాంజనేయులు (45) అనే రైతు మంగళవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లాడు. విద్యుత్ లేకపోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫీజు వేస్తుండగా దాన్ని వేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
తలుపుల: అనంతపురం జిల్లా తలుపుల మండలం సింగనపల్లిలో కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే రామాంజనేయులు రెడ్డి(34) రెండు రోజులుగా కనిపించడం లేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఊరి శివారులోని కొత్త చెరువు వద్ద రామాంజనేయులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డుప్రమాదంలో రైతు మృతి
పామిడి(అనంతపురం): గ్రామ దేవతకు పూజలు చేసి బైక్ పై వెళ్తున్న ఓ రైతు ఆగి ఉన్న వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుంతకల్లుకు చెందిన రామాంజనేయులు(46)కు పామిడి మండలం పాళ్యం వద్ద పొలాలున్నాయి. ఏటా వానాకాలంలో కుటుంబం సహా వచ్చి పొలంలోని దేవతకు పూజలు చేయటం ఆనవాయితీ. అందులో భాగంగానే శుక్రవారం ఉదయం కుటుంబసభ్యులంతా ఆటోలో పొలానికి చేరుకోగా రామాంజనేయులు బైక్‌పై వచ్చారు. తిరుగు ప్రయాణంలో రామాంజనేయులు ఎద్దులపల్లి వద్ద ప్రమాదవశాత్తు ఆగి ఉన్న బైక్‌ను ఢీకొట్టాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
చిరుత బీభత్సం
కంబదూరు : కంబదూరులోని మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలో చాకిరేవు వద్ద శుక్రవారం రాత్రి చిరుత బీభత్సం సృష్టించింది. మందపై దాడి చేసి 11 గొర్రె పిల్లలను చంపేసింది. శనివారం ఉదయం గ్రామ శివారులోని రామప్పకొండ వద్ద ఓ మహిళను వెంబడించింది. బాధితుడి కథనం మేరకు.. కంబదూరుకు చెందిన మథర్సాబ్ ఇంటి వద్ద స్థలం లేకపోవడంతో రెండు నెలల నుంచి గ్రామ శివారులోని చాకిరేవు వద్ద రొప్పం ఏర్పాటు చేసుకున్నాడు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ పరిసరాల్లోనే గొర్రెలను మేపేవాడు. శుక్రవారంగొర్రె పిల్లలను రొప్పంలోనే వదిలేసి.. గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. సాయంత్రం తిరిగి స్థావరానికి చేరుకున్నాడు. గొర్రెలను ఒకచోట, పిల్లలను మరోచోట వదిలాడు. చీకటి పడగానే చిరుత గొర్రెపిల్లలు ఉన్న మందలోకి చొరబడి దాడి చేయడం మొదలుపెట్టింది. కాపరి గమనించి భయంతో పరుగు పరుగున వచ్చి గ్రామస్తులకు విషయం తెలిపాడు. జనం వెళ్లి గట్టిగా కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. అప్పటికే 11 గొర్రె పిల్లలను చంపేసింది. మృతి చెందిన గొర్రె పిల్లలకు శనివారం పశుసంవర్ధక శాఖ ఏడీఏ ప్రకాష్, గోపాలమిత్ర రామాంజినేయులు పోస్టుమార్టం నిర్వహించారు. బాధితుడికి పరిహారం అందజేస్తామని కళ్యాణదుర్గం ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శివరాము తెలిపారు. ఉదయమే కలకలం.. శుక్రవారం రాత్రి గొర్రె పిల్లలపై దాడి చేసిన చిరుత.. శనివారం ఉదయం కూడా కలకలం సృష్టించింది. గ్రామ శివారులోని రామప్పకొండపై బండ కొట్టేందుకు ఉదయం తొమ్మిది గంటలకు వ డ్డె మంజుల అనే మహిళ వెళ్లింది. అక్కడ చిరుత కన్పించడంతో భయంతో పరుగులు తీసింది. ఆమెను చిరుత కొంత దూరం వెంబడించింది. ఆమె పరుగెత్తుకొని సమీపంలో ఉన్న మనుషుల వద్దకు చేరుకుని వారికి విషయం తెలిపింది. వారంతా వెళ్లి చూడగా చిరుత కొండ మీదే ఉండడంతో వెంటనే కంబదూరు ఎస్ఐ శ్రీధర్‌కు సమాచారమిచ్చారు. ఆయన సిబ్బంది తో అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. కళ్యాణదుర్గం రేంజ్ అధికారులు షెక్షావలి, శివరాము, మల్లికార్జున తదితరులు అక్కడికి చేరుకున్నారు. చిరుత నుంచి మండల ప్రజలు, పశువులకు రక్షణ కల్పిస్తామని శివరాం హామీ ఇచ్చారు. అది అటవీ ప్రాంతంలోకి వెళ్లే వరకు తమ సిబ్బంది గస్తీ నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మూడు నెలలుగా చిరుతల సంచారం మండలంలోని పలు ప్రాంతాల్లో మూడు నెలలుగా చిరుతలు సంచరిస్తున్నాయి. పశువులు, కుక్కలపై దాడి చేస్తున్నాయి. రాత్రిపూట పలుమార్లు కన్పించిన దాఖలాలు ఉన్నాయి. దీంతో వ్యవసాయ పొలాల్లోకి వెళ్లాలంటే రైతులు భయపడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అటవీ శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోలేదని ప్రజలు అంటున్నారు. -
కలెక్టరేట్ ఎదుట ‘తప్పెట' హోరు
అనంతపురం అర్బన్: ఇచ్చిన హామీ మేరకు పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మాదిగ హక్కుల తప్పెట కళాకారులు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు సప్తగిరి సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీగా వెళ్లి తప్పెట్ల మోతతో హోరెత్తించి నిరసన తెలిపారు. మాదిగలకు ఇచ్చిన హామీలను విస్మరించి ముఖ్యమంత్రి చీకటి చంద్రుడయ్యారని నాయకులు ధ్వజమెత్తారు. జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అధ్యక్షతన చేపట్టిన ధర్నాలో వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరు శ్రీరాములు మాట్లాడారు. మాదిగలను అన్ని విధాలుగా అదుకుంటామని, తప్పెట కళాకారుల శ్రేయస్సు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించి వారి జీవితాల్లో వెలుగునింపుతామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి, గ్రామానికి వారధులుగా పనిచేసే తప్పెట కళాకారుల అభివృద్ధిని ప్రభుత్వాలన్నీ విస్మరిస్తున్నాయన్నారు. జిల్లాలో అందరు కళాకారులకరూ ప్రభుత్వం పింఛన్ అందజేస్తుందన్నారు. కానీ తప్పెట కళాకారులను విస్మరించిందని విచారం వ్యక్తం చేశారు. పింఛన్లు అందజేస్తామని తప్పెట కళాకారులకు హామీ ఇచ్చిన బాబు ఇప్పటి వరకూ అమలు చేయాలేదన్నారు. ప్రతి తప్పెట కళాకారునికి నెలకు రూ. 2 వేల పింఛను, 3 ఎకరాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రుణాలను మంజూరు చేయాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఖాజా మొహిద్దీన్‌కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పర్వతప్ప, ఉపాధ్యక్షుడు ఎవి.రమణ, ఆంజినేయ్య, శెట్టూరు హనుమప్ప, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన యానిమేటర్లు
కల్లూరు: హక్కుల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా సమ్మె చేస్తున్న యానిమేటర్లు ఆందోళన తీవ్రతరం చేశారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు మాట్లాడుతూ ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లకు 15 నెలలుగా వేతనాలు అందకపోవడంతో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపట్టారన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో 31వ రోజులుగా సమ్మె చేస్తున్న సర్కార్ స్పందించకపోవడం దారుణమన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని విడనాడి వెంటనే చర్చలు నిర్వహించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ నెల రోజులుగా విధులు బహిష్కరించడం వల్ల పొదుపు సంఘాల్లో పురోభివృద్ధి సన్నగిల్లుతుందన్నారు. బ్యాంకింగ్‌లో రుణాల చెల్లింపులు నిలిచిపోయి కొత్త రుణాలు తీసుకోవాల్సిన పొదుపు మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. యానిమేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి మాట్లాడుతూ ఐకేపీ ప్రాజెక్టు సిబ్బందిని ఉద్యోగులుగా గుర్తించాలని, నెల నెల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కారు తీసుకున్న నిర్ణయాలను మేము అంగీకరించమని మంత్రి వర్గ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. రాజకీయ వేధింపులు మానుకోవాలని, గుర్తింపు కార్డులు, నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు. ఎలాంటి అవాంఛీనయ సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న యూనిమేటర్లు, నాయకుల ప్రసంగాలను పోలీసులు అడ్డుకున్నారు. ప్రసంగిస్తున్న నాయకులను పోలీసులు తమ బలగాలతో వ్యాన్లలోకి బలవంతంగా ఎక్కించారు. మహిళా సిబ్బందిని మహిళా పోలీసులు చుట్టుముట్టి అరెస్టు చేసి జీపుల్లోకి ఎక్కించి నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో రెండు గంటలపాటు ఉంచుకుని 125 మందిపై కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు సాయిబాబా, పుల్లారెడ్డి, రాముడు, గోపాల్, సుధాకరప్ప, నాగరాజు, ఆయా మండలాల యానిమేటర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
హలిగేరిలో ఇద్దరి దారుణ హత్య
ఆస్పరి: మండల పరిధిలోని హలిగేరి గ్రామంలో పాతకక్షలు మళ్లీ భగ్గుమన్నాయి. తలారి వర్గీయులు.. బంగి వర్గానికి చెందిన బంగి శ్రీనివాసులు(50), బంగి మల్లయ్య(40)లను దారుణంగా హత్య చేశారు. ఘటనలో రామాంజినేయులు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. జంట హత్యలతో గ్రామం వణికిపోతోంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బంగి, తలారి వర్గీయుల మధ్య 2011 సంవత్సరం నుంచి వ్యక్తిగత కక్షలు ఉన్నాయి. మంగళవారం బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్యలు ఎరువులు తీసుకొచ్చేందుకు రామాంజినేయులు ఆటోలో ఆదోనికి బయలుదేరారు. సాయంత్రం హలిగేరికి తిరిగొస్తుండగా శివారులో తలారి వర్గానికి చెందిన అంజినయ్య, మరికొందరు రాళ్లతో దాడి చేయడంతో డ్రైవర్ ఆటోను ఓ పక్కన నిలిపేశాడు. ఆ వెంటనే ఆటోలోని బంగి శ్రీనివాసులు, బంగి మల్లయ్యలను కత్తులు, వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. డ్రైవర్ భయంతో పరుగు తీయగా వెంబడించి నరికి పరారయ్యారు. గాయపడిన రామాంజనేయులును బంధువులు చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలిసిన వెంటనే ఆస్పరి ఎస్ఐలు లక్ష్మీనారాయణ, కిరణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆదోని డీఎస్పీ శివరామిరెడ్డి, ఆలూరు సీఐ శంకరయ్యలు గ్రామానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. హత్యలకు కారణాలను బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత హత్యోదంతాలకు పాత కక్షలే కారణమని తెలిపారు. గ్రామంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.