అనంతపురం : అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పుట్టపర్తి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీయూడీఏ) వైస్ చైర్మన్ రామాంజనేయులు ఇంటిపై శనివారం ఏసీబీ అధికారులు మరోసారి దాడి చేశారు. భారీగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నాడనే ఆరోపణల నేపథ్యంలో రామాంజనేయులు నివాసంపై ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు నివాసంలో రూ.2 కోట్ల ఆస్తులు గుర్తించినట్లు సమాచారం. అయితే నెలరోజుల వ్యవధిలో ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు రెండోసారి కావటం గమనార్హం.
రామాంజనేయులు ఇంటిపై ఏసీబీ దాడి
Published Sat, Apr 30 2016 9:40 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement
Advertisement