
సామియా తండ్రి, మాజీ భర్త అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటీషు మహిళ సామియా షాహిద్ పరువు హత్య కేసులో ఆమె తండ్రి మహ్మద్ షాహిద్, మాజీ భర్త మహ్మద్ షఖీల్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ ఆదివారం అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు బృందం ప్రధానాధికారి వెల్లడించారు. సామియాను నిందితులు హత్య చేసినట్టు బలమైన సాక్ష్యాధారాలు సంపాదించినట్టు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచేలోగా మరిన్ని సాక్ష్యాలు సంపాదిస్తామని చెప్పారు.
పంజాబ్ ప్రావిన్స్లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. సామియా అనారోగ్యంతో మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. ఆమె రెండో భర్త ముక్తార్ కాజిమ్ ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూసింది. సామియాను గొంతు పిసికి చంపినట్టు ఆమె మాజీ భర్త మహ్మద్ షకీల్ పోలీసుల ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నాడు. షియా తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకుందనే కోపంతోనే ఆమెను చంపినట్టు తెలిపాడు.