Samia Shahid
-
సామియాను రేప్ చేసి, హత్యచేశాడు
లాహోర్: బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్థానీ యువతి సామియా షాహిద్ హత్యకేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. వేరే తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకోవడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె మాజీ భర్త చౌధురీ షకీల్ దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు ఆమెను శారీరకంగా హింసించి, అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడైంది. సామియా తల్లిదండ్రుల సమ్మతితోనే ఆమెను హత్యచేసినట్టు షకీల్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. సామియా గుండెపోటుతో మరణించినట్టు ఆమె తండ్రి మహ్మద్ షాహిద్ తొలుత పోలీసులకు చెప్పాడు. తర్వాత ఆయన మాటమార్చి తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. సామియా రెండో భర్త సయ్యద్ ముక్తర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం సయ్యద్‌ను పెళ్లిచేసుకున్న సామియా అతనితో కలసి దుబాయ్‌లో ఉంటోంది. కాగా సామియా కుటుంబ సభ్యులు ఆమె తండ్రికి అనారోగ్యంగా ఉందని అబద్దం చెప్పి పాక్‌కు రప్పించారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. సామియాపై లైంగికదాడి చేసిన తర్వాత ఓ గుడ్డతో ఆమె గొంతు బిగించి చంపినట్టు మాజీ భర్త పోలీసుల విచారణలో అంగీకరించాడు. షకీల్‌తో పాటు సామియా తండ్రిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సామియా తల్లిని, సోదరిని పోలీసులు విచారించనున్నారు. -
సామియా తండ్రి, మాజీ భర్త అరెస్ట్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సంతతికి చెందిన బ్రిటీషు మహిళ సామియా షాహిద్ పరువు హత్య కేసులో ఆమె తండ్రి మహ్మద్ షాహిద్, మాజీ భర్త మహ్మద్ షఖీల్ ను పాక్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరినీ ఆదివారం అరెస్ట్ చేసినట్టు దర్యాప్తు బృందం ప్రధానాధికారి వెల్లడించారు. సామియాను నిందితులు హత్య చేసినట్టు బలమైన సాక్ష్యాధారాలు సంపాదించినట్టు తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచేలోగా మరిన్ని సాక్ష్యాలు సంపాదిస్తామని చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. సామియా అనారోగ్యంతో మృతి చెందిందని, ఆమె మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా ఖననం చేశారు. ఆమె రెండో భర్త ముక్తార్ కాజిమ్ ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగు చూసింది. సామియాను గొంతు పిసికి చంపినట్టు ఆమె మాజీ భర్త మహ్మద్ షకీల్ పోలీసుల ఇంటరాగేషన్ లో ఒప్పుకున్నాడు. షియా తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకుందనే కోపంతోనే ఆమెను చంపినట్టు తెలిపాడు. -
సామియాను మొదటి భర్తే చంపేశాడు
లాహోర్: బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్థానీ యువతి సామియా షాహిద్ హత్యకేసు మిస్టరీ వీడింది. షియా తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకుందనే కారణంతో ఆమె మాజీ భర్త చౌధురీ షకీల్ చంపేశాడు. సామియా తల్లిదండ్రుల సమ్మతితోనే ఆమెను హత్యచేసినట్టు షకీల్ చెప్పాడు. నేరం చేసినట్టు షకీల్ విచారణలో అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. వేరే తెగకు చెందిన వ్యక్తిని తన మాజీ భార్య పెళ్లిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయానని, అందుకే ఆమెను హత్య చేశానని షకీల్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసులో సామియా తల్లిదండ్రులు ప్రమేయముందని, వారిని కూడా విచారించాలని షకీల్ పోలీసులకు చెప్పాడు. సామియా తల్లిదండ్రుల సమ్మతితోనే ఆమెను హత్యచేసినట్టు వెల్లడించాడు. కాగా ఈ కేసులో షకీల్‌ను కాపాడేందుకు సామియా తల్లిదండ్రులు ప్రయత్నించినట్టు పోలీసులు తెలిపారు. కేసును కప్పిపుచ్చేందుకు సామియా తండ్రి విరుద్ధ వాంగ్మూలాలు ఇచ్చినట్టు చెప్పారు. షకీల్‌తో పాటు సామియా తండ్రిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌లో పరువు హత్యలు తరచూ జరుగుతున్నాయి.