సామియాను రేప్ చేసి, హత్యచేశాడు | British-Pak beautician was raped before being strangled by ex-husband | Sakshi
Sakshi News home page

సామియాను రేప్ చేసి, హత్యచేశాడు

Published Sat, Sep 3 2016 3:06 PM | Last Updated on Sat, Mar 23 2019 8:41 PM

సామియాను రేప్ చేసి, హత్యచేశాడు - Sakshi

సామియాను రేప్ చేసి, హత్యచేశాడు

బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్థానీ యువతి సామియా షాహిద్ హత్యకేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.

లాహోర్: బ్రిటీష్ సంతతికి చెందిన పాకిస్థానీ యువతి సామియా షాహిద్ హత్యకేసు దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. వేరే తెగకు చెందిన వ్యక్తిని సామియా రెండో పెళ్లిచేసుకోవడంతో జీర్ణించుకోలేకపోయిన ఆమె మాజీ భర్త చౌధురీ షకీల్ దారుణంగా హత్యచేశాడు. అంతకుముందు ఆమెను శారీరకంగా హింసించి, అత్యాచారం చేసినట్టు విచారణలో వెల్లడైంది. సామియా తల్లిదండ్రుల సమ్మతితోనే ఆమెను హత్యచేసినట్టు షకీల్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.

సామియా గుండెపోటుతో మరణించినట్టు ఆమె తండ్రి మహ్మద్ షాహిద్ తొలుత పోలీసులకు చెప్పాడు. తర్వాత ఆయన మాటమార్చి తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. సామియా రెండో భర్త సయ్యద్ ముక్తర్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం సయ్యద్ను పెళ్లిచేసుకున్న సామియా అతనితో కలసి దుబాయ్లో ఉంటోంది. కాగా సామియా కుటుంబ సభ్యులు ఆమె తండ్రికి అనారోగ్యంగా ఉందని అబద్దం చెప్పి పాక్కు రప్పించారు. పంజాబ్ ప్రావిన్స్లోని జెలుం జిల్లాలో సామియా తల్లిదండ్రుల ఇంట్లో గత నెల 20న ఆమె హత్యకు గురైంది. సామియాపై లైంగికదాడి చేసిన తర్వాత ఓ గుడ్డతో ఆమె గొంతు బిగించి చంపినట్టు మాజీ భర్త పోలీసుల విచారణలో అంగీకరించాడు. షకీల్తో పాటు సామియా తండ్రిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. సామియా తల్లిని, సోదరిని పోలీసులు విచారించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement