బారాబాంకి: పరువు హత్య జాడలు ఇంకా సమసిపోలేదు. దేశంలో ఏదో మూలా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయి. ఓ యువతిని ప్రేమించి పాపానికి ఇద్దరు యువకులు హత్య చేయబడ్డ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని గణప్ప గ్రామంలో శుక్రవారం ఉదయం సంభవించింది. అనిల్, అవినాష్ ఇద్దరు స్నేహితులు. అనిల్ అనే యువకుడు సోహై గ్రామానికి చెందిన యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. ఆకస్మాత్తుగా వీరివురూ చెట్టుకు వేలాడుతూ శవాలై కనిపించారు.
ప్రేమించినందుకు అనిల్ ను, అతనితో స్నేహితుడు అవినాష్ ను హత్య చేసారని అనిల్ తండ్రి రాం శంకర్ ఆరోపిస్తున్నారు. రాం శంకర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.