ఇంకేం పరువు? | Miryalaguda Pranay Murder Case | Sakshi
Sakshi News home page

ఇంకేం పరువు?

Published Tue, Sep 18 2018 7:29 AM | Last Updated on Fri, Mar 22 2024 11:28 AM

‘ప్రేమిస్తే చంపేస్తారా!’ అంటూ ఒక యువతి చేసిన ఆర్తనాదం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు... తెలుగువారున్న ప్రతి గడ్డపైనా ప్రతిధ్వనిస్తోంది. కొన్ని ఉదంతాలు మనం రోజూ చూస్తున్న సమాజంపై అపనమ్మకమూ, అవిశ్వాసమూ కలిగిస్తాయి. ఈ సమాజంలో ఇంత క్రౌర్యం, ఇంత రాక్షసం దాగున్నాయా అన్న దిగ్భ్రాంతిలో ముంచెత్తుతాయి. నల్లగొండ జిల్లా మిర్యాలగూ  డలో శుక్రవారం పట్టపగలు చోటు చేసుకున్న దురంతం అటువంటిదే. ఒక్కగానొక్క కుమార్తెను ఎంతో అపురూపంగా చూసుకుని, ఆమె ఇష్టాయిష్టాలను అర్ధం చేసుకుని నెరవేర్చవలసిన కన్న తండ్రే కాలయముడిగా మారి ఆమె మనువాడినవాడిని మట్టుబెట్టిన ఉదంతమది. పట్టణంలో బాగా డబ్బు చేసిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి మారుతీరావు తన కుమార్తె అమృతవర్షిణితో ఆప్యా యత నటిస్తూనే అల్లుడు ప్రణయ్‌ని కిరాయి హంతకుడితో తుదముట్టించిన తీరు మానవత్వమున్న ప్రతి ఒక్కరినీ కదిలించింది. కంటతడి పెట్టించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement