పరువు కోసం..చంపేశారు | Honour killings in madhya pradesh village | Sakshi
Sakshi News home page

పరువు కోసం..చంపేశారు

Published Thu, Jun 11 2015 8:19 PM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

Honour killings in madhya pradesh village

మధ్యప్రదేశ్లోని టికమ్గఢ్ గ్రామంలో ఓ యువజంటను కొంతమంది వ్యక్తులు కాల్చి చంపేశారు. ఇది పరువు హత్య కేసు అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది వచ్చే వరకు మృతికి కారణం ఏంటో చెప్పలేమని అదనపు ఎస్పీ సునీల్ తివారీ చెప్పారు. హనుపురా గ్రామంలో ఈ యువజంట మృతదేహాలు కనిపించాయని ఆయన అన్నారు.

వీళ్లిద్దరి సంబంధం గురించి గ్రామంలో విపరీతంగా చర్చ జరిగిందని, బహుశా దానివల్లే పరువు హత్య జరిగి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. బడీ రాజా, భాన్ సింగ్లుగా ఈ జంటను గుర్తించారు. బడీ రాజా అనే ఆ మహిళకు గురువారం పెళ్లి కావాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement