ఇలాంటి సైకిక్ తండ్రిని తన జీవితంలో ఎక్కడా చూడలేదని, అతను జైల్లోనే చచ్చిపోవాలని ప్రణయ్ సోదరుడు అజయ్ కన్నీమున్నీరుయ్యాడు. బయటకు వస్తే మారుతీరావును జనాలే చంపుతారని హెచ్చరించాడు. తమ కుటుంబం చంపదని, జనాలే చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన అజయ్.. సోదరుడి మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. ఇటీవల రాఖీ పౌర్ణమి సందర్భంగానే సొంతూరికి వచ్చాడని, ఈ సందర్భంగా అమృత రాఖీ కట్టిందని గుర్తు చేసుకుంటూ ప్రణయ్ తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు.