పంజాబ్‌లో ఓ తండ్రి 15 ఏళ్ల తన కూతురు, ఆమె ప్రియుడిని ఆదివారం పరువు హత్య చేశాడు.
తరణ్‌తారణ్: పంజాబ్‌లో ఓ తండ్రి 15 ఏళ్ల తన కూతురు, ఆమె ప్రియుడిని ఆదివారం పరువు హత్య చేశాడు. తరణ్‌తారణ్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామంలో నివసించే దొగార్ సింగ్ కుమార్తె సుఖ్వీందర్ కౌర్.. రణదీప్ సింగ్ అనే యువకుడిని ప్రేమిస్తోంది.
విషయం తెలుసుకున్న దొగార్ పదునైన ఆయుధం ఉపయోగించి తన ఇంట్లోనే ఇద్దరినీ చంపేశాడు. అయితే, సుఖ్వీందర్, రణదీప్‌ల మధ్య శారీరక సంబంధం ఉందని పోలీసులు వెల్లడించారు.