
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి న్యాయం కోసం తన పోరాటాన్ని ప్రారంభించింది. ప్రణయ్‌ని చంపిన వాళ్లను శిక్షించటానికి, పుట్టబోయే బేబీని పెంచి పెద్ద చేస్తానని.. ముఖ్యంగా ప్రణయ్ ఆశయమైన క్యాస్టిజంపై పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అన్నట్టుగానే అమృత ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్‌బుక్ పేజీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది.
పురువు, కుల పిచ్చితో ప్రణయ్‌ను చంపిన అమృత తండ్రి మారుతీరావును, హత్యకు సహకరించిన నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతోంది. ఆమెకు భారీ మద్దతు లభిస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన అమృత తండ్రి మారుతీరావు, బాబాయ్ శ్రవణ్, సుఫారీ కిల్లర్స్‌తో పాటు హత్యకు సహకరించిన వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment