సాక్షి,అబిడ్స్(హైదరాబాద్): బేగంబజార్‌లో గత నెలలో జరిగిన పరువు హత్య కేసులోని బాధితులు శుక్రవారం రాష్ట్ర టీఆర్‌ఎస్ నాయకులు నందకిశోర్ వ్యాస్, పూజావ్యాస్ బిలాల్ ఆధ్వర్యంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నందకిశోర్ వ్యాస్, పూజావ్యాస్ బిలాల్, పరువు హత్యకు గురైన నీరజ్ పన్వార్ భార్య సంజనా పన్వార్, తల్లి నిషా పన్వార్, ఇతర కుటుంబ సభ్యులు తమకు న్యాయం జరగాలని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన మంత్రి కేటీఆర్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో ఫోనులో మాట్లాడి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసును విచారించేలా చూడాలని ఆదేశించారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా కేసును ఛేధించాలని ఆదేశించినట్లు నందకిశోర్ వ్యాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోషామహాల్ నియోజకవర్గంలో సీనియర్లకు, యాక్టివిస్టులకు ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని మంత్రికి నందకిశోర్ వ్యాస్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment