
యువకుడితో సన్నిహితంగా ఉంటుందని..
ఉత్తరప్రదేశ్: కూతురు ఓ యువకుడితో సన్నిహితంగా ఉంటుందని తెలిసి తల్లి, ఇద్దరు బంధువులు కలిసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బలియా గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కుర్తియా గ్రామానికి చెందిన యువకుడితో పద్దెనిమిదేళ్ల దళిత అమ్మాయి సన్నిహితంగా ఉంటుందని తెలిసి ఆమె తల్లి, ఇద్దరు బంధువులు కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
హత్య అనంతరం అమ్మాయి మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా అదే గ్రామంలో ఓ గుడిసెలో గుంత తీసి పూడ్చిపెట్టారని ఎస్పీ మనోజ్ ఘా తెలిపారు. కాగా అమ్మాయి మృతదేహాన్ని కొందరు గ్రామస్తులు గుర్తించి తమకు సమాచారం అందించారన్నారు. హత్యకు పాల్పడిన మృతురాలి తల్లి, ఇద్దరు బంధువులపై ఆదివారం కేసు నమోదు చేసిన ట్లు ఆయన తెలిపారు.