
'తల్లిదండ్రులు హత్య చేయొచ్చు'!
చెన్నై: 'మీరు హత్య చేశారా అది కూడా ప్రత్యేకంగా పరువు హత్యా ఏం పర్వాలేదు నాదగ్గరకు రండి! మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను' అంటూ తమిళనాడులో ఓ న్యాయవాది ఏకంగా బహిరంగంగా ప్రకటించారు. అది కూడా సామాజిక మాద్యమం ద్వారా. ఉదయాన్నే లేవగానే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ఈ విషయం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయింది.
పరువు హత్య చేయడం తప్పేం కాదని పేర్కొంటూ టీ ఎస్ఏ అరుణ్ కుమార్ అనే తమిళనాడు న్యాయవాది పేర్కొంటూ కలకలం రేపాడు. 'పరువు హత్యకు పాల్పడ్డారా.. ఏ బాధపడవొద్దు. నాదగ్గరికి రండి. నేను మీ కేసు టేకప్ చేసుకుంటాను. పరువు హత్య తప్పేం కాదు. పరువుతీసినందుకు అది వేసే ఒక శిక్ష మాత్రమే. పరువును దృష్టిలో పెట్టుకొని చంపేసే హక్కు తల్లిదండ్రులకు ఉంది' అంటూ అతడు ఫేస్ బుక్ లో పెట్టాడు. దీనిని చూసిన గీతా నారాయణన్ అనే ఓ సామాజిక వేత్త వెంటనే దాన్ని చెన్నై పోలీస్ కమిషనర్ కు ట్యాగ్ చేశారు. దీంతో అతడి ఖాతాను మూసి వేసి పోలీసులు నోటీసులు పంపించారు.