
పరువు కోసం.. కాల్చి, గొడ్డలితో నరికేశారు!
తల్లిదండ్రులతో పాటు ముక్కుపచ్చలారని నాలుగేళ్ల చిన్నారిని కూడా ‘పరువు’ పేరుతో దారుణంగా హతమార్చారు. ఈ ఘటన పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. కుటుంబ పెద్ద నోట్లో తుపాకి పెట్టి మూడు రౌండ్ల బుల్లెట్లు కాల్చగా, అతడి భార్య, నాలుగేళ్ల కొడుకు తలలను గొడ్డలితో నరికేశారు.
ఘటనా స్థలానికి సమీపంలో ఒక మోటార్ సైకిల్, కాస్మొటిక్స్ ఉన్న పర్సు లభించాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఇది పరువు హత్యే అయి ఉండొచ్చని భావిస్తున్నామన్నారు. మరణించిన వాళ్లు ఆ పిల్లాడికి తల్లిదండ్రులేనా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు వాళ్ల రక్త నమూనాలను డీఎన్ఏ పరీక్షకు పంపుతున్నట్లు చెప్పారు.