
సాక్షి, తిరుపతి: సనాతన ధర్మానికి నిరంతర సేవ చేస్తున్న ట్రావన్ కోర్ ప్రిన్సెస్ అశ్వతి గౌరి లక్ష్మీబాయికి సనాతన ధర్మ భారతి స్పూర్తి పురస్కారాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి చేతుల మీదుగా అందజేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామండపంలో సేవ్ టెంపుల్స్ భారత్, వేద విజ్ఞాన సమితి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లక్ష్మీబాయిని ఘనంగా సత్కరించారు.
పద్మనాభ స్వామి దేవాలయం సంపదల పరిరక్షణలో ఆమె చేసిన పోరాటం ప్రశంసనీయమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్, టెంపుల్స్ భారత్ చైర్మన్ డా.గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment