
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో శారదా పీఠం ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి మంగళవారం కలిశారు. అనంతరం స్వాత్మానందేంద్ర సరస్వతి మీడియాతో మాట్లాడుతూ, దేవాలయాల భద్రతపై సీఎంతో మాట్లాడానని తెలిపారు. స్వరూపానంద స్వామి ఇచ్చిన సూచనలను ముఖ్యమంత్రికి నివేదించానని పేర్కొన్నారు. (చదవండి:పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్)
‘‘తాను చెప్పిన అంశాలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. దాడులపై దర్యాప్తు వేగవంతం చేస్తామని సీఎం చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో విజయవాడలో కూల్చిన దేవాలయాలను పునర్నిర్మిస్తామని..ఈ నెల 8న శంకుస్థాపన చేస్తున్నట్టుగా సీఎం తెలిపారు. ఇప్పటికే 30 వేల ఆలయాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్టు చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో ప్రభుత్వం ముందుంటుందని సీఎం వైఎస్ జగన్ చెప్పారని’’స్వాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. (చదవండి: మతాలతో ఆటలా..: సజ్జల రామకృష్ణారెడ్డి)