
సాక్షి, విశాఖపట్నం : శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి , స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీలు గురువారం సింహాచలంలోని వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొన్నారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వాహణ అధికారి వెంకటేశ్వర్ రావు పీఠాధిపతులకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామిలిద్దరు కలిసి అర్చకుల సమక్షంలో నరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేపటి నుంచి తెలంగాణలో 57 రోజుల పర్యటన చేపట్టనున్నట్లు స్మాత్మానందేంద్ర సరస్వతి వెల్లడించారు. అనంతరం దేవి శరన్ననవరాత్రులకు సంబంధించిన ఉత్సవాల బ్రౌచర్‌ను స్వరూపానందేంద్ర స్వామి విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment