
సాక్షి, కాకినాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి రథాన్ని పరిశీలించిన స్వామీజీ.. రథం అత్యంత సుందరంగా ఉందని, 90 రోజుల్లో 40 అడుగుల రథాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంశించారు. స్వామివారి ఉత్సవాలకు ముందే రథాన్ని నిర్మించడం ఆనందదాయకమని స్వామీజీ పేర్కొన్నారు. రథం యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమానుసారం శాస్త్రబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులు, పండితులకు స్వామీజీ పలు సూచనలు చేశారు. ఆలయాల్లో రథాలు భగవంతుని శరీరంలో భాగమని పేర్కొన్న స్వామీజీ.. దైవ సంపద పరిరక్షణ దేవాదాయశాఖతో పాటు ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment