antarvedhi
-
పురవీధుల్లో విహరించిన స్వామి అమ్మవార్లు
-
లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న శారదాపీఠం ఉత్తరాధికారి
సాక్షి, కాకినాడ: విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి గురువారం అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి రథాన్ని పరిశీలించిన స్వామీజీ.. రథం అత్యంత సుందరంగా ఉందని, 90 రోజుల్లో 40 అడుగుల రథాన్ని నిర్మించడం అభినందనీయమని ప్రశంశించారు. స్వామివారి ఉత్సవాలకు ముందే రథాన్ని నిర్మించడం ఆనందదాయకమని స్వామీజీ పేర్కొన్నారు. రథం యొక్క సంప్రోక్షణ కార్యక్రమాన్ని ఆగమానుసారం శాస్త్రబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులు, పండితులకు స్వామీజీ పలు సూచనలు చేశారు. ఆలయాల్లో రథాలు భగవంతుని శరీరంలో భాగమని పేర్కొన్న స్వామీజీ.. దైవ సంపద పరిరక్షణ దేవాదాయశాఖతో పాటు ప్రతిఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. -
అంతర్వేది ఘటన : కరోనా కలకలం
సాక్షి, తూర్పుగోదావరి : ఇటీవల చోటుచేసుకున్న అంతర్వేదీ ఘటనలో కరోనా కలకలం రేపుతోంది. రథం దగ్ధమైనందుకు నిరసనగా పలువురు ఆందోళనలో కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయగా వారిలో కొంతమందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 36 మంది నిందితుల్లో ఇద్దరికి కరోనాగా నిర్ధారణ కాగా.. ముందస్తు జాగ్రత్తగా పోలీసు అధికారులు కూడా పరీక్షలు చేసుకున్నారు. దీనిలో జిల్లా అదనపు ఎస్పీ( పరిపాలన) కరణం కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఆయనతో పాటు ఈ కేసును విచారించిన ఎస్పీ నయీమ్ ఆస్మి, రాజోలు సీఐ దుర్గా శేఖర్ రెడ్డి, ఆయన డ్రైవర్, రైటర్, మరో ఐదుగురు ఎస్ఐలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం వారంతా వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకుంటున్నారు. పలువరు పోలీసు అధికారులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. (అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తు) కాగా తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం, అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఈనెల 6న ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. 62 ఏళ్ల చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతైంది. ఈ కేసు దర్యాప్తును ఏపీ పోలీసులు సవాలుగా తీసుకున్న తరువాత కూడా కొన్ని రాజకీయ శక్తులు, సంఘాలు మీడియా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్రప్రభుత్వంపై లేనిపోని ఆపోహలను ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో దోషులు ఎవరైనాసరే కఠినంగా శిక్షించాల్సిందేనన్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని ప్రకటించింది. దీనిలో సీబీఐ దర్యాప్తును కోరుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన జీఓ శుక్రవారం వెలువడనుంది. (అగ్నికి ఆహుతైన స్వామి వారి రథం) -
హంస, శేష వాహనాలపై నరసన్న
సఖినేటిపల్లి(రాజోలు) : అంతర్వేది శ్రీలక్ష్మీ నృసింహస్వామివారు హంస, శేష వాహనాలపై శనివారం గ్రామంలో ఊరేగారు. స్వామివారి కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో అర్చకులు వాస్తుపూజ, అంకురార్పణ, విష్ణుదీక్షాధారణ చేపట్టారు. ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగడానికి ఏటా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. స్వామి వారిని సాయంత్రం హంస వాహనంపై ఉంచి గ్రామంలో ఊరేగించారు. స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూశారు. రాత్రి శేష వాహనంపై ఉంచి స్వామి వారి గ్రామోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ధూపసేవ, ధ్వజారోహణం కార్యక్రమాలు జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.