సాక్షి, హైదరాబాద్/తాడేపల్లి: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా భోగి పండుగ వేడుక సంబరాల్లో ప్రజలు పాల్గొన్నారు. తెల్లవారుజామునే భోగి మంటలు వేసి ప్రజలు ఆనందంతో పండుగ జరుపుకుంటున్నారు. ఇక, మాజీ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి భోగి పండుగ సంబరాలు చేసుకున్నారు. ప్రజలు భోగి శుభాకాంక్షలు తెలిపారు.
నగరిలో మాజీ మంత్రి రోజా ఇంటి వద్ద భోగి పండుగ సంబరాలు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ కుటుంబ సభ్యులతో సందడి చేశారు. అటు విశాఖ నగరంలో ఘనంగా భోగి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి భోగి వేడుకలు చేసుకుంటున్నారు.
విజయవాడలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. బీసెంట్ రోడ్డులో కార్యకర్తలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తెలుగు వారి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకునే పరిస్థితి లేదు . వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలంతా ఆనందంగా పండుగ జరుపుకున్నారు. కానీ, ఈరోజు ఏపీలో అలాంటి పరిస్థితి లేదు. ప్రజలంతా ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఈ సంక్రాంతికి ప్రజలకు నిరాశ, నిస్పృహలను మిగిల్చింది. ఎన్నికల ముందు కూటమి అనేక హామీలిచ్చింది. ఇప్పుడు కరెంట్, నిత్యవసర ధరల పెంచేసి ప్రజలపై భారం మోపిందన్నారు.
ఇటు తెలంగాణలో సహా భోగి పండుగ వేడుకల్లో ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజామునే భోగీ మంటలు వేసి సంబరాలు చేసుకున్నారు. మరోవైపు.. నగరవాసులంతా పల్లెలకు తరలి వెళ్లడంతో గ్రామాల్లో వేడుకలు మరింత ఘనంగా జరుగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment