
భోగి పండగ రోజు సాధారణంగా అందరూ ఏం చేస్తారు. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి, ముఖం, కాళ్లు, చేతులు కడుక్కుని, అంతా ఆరుబైటకు చేరి, భక్తితో భోగి మంటలు వేస్తారు. ఈ భోగి మంటల కోసం దైవ నామస్మరణ చేస్తూ, ఆవుపేడ పిడకలను, సమిధలను పెట్టి, కర్పూరంతో అగ్నిని రగిలిస్తారు. అగ్నిదేవుడిని ప్రార్ధిస్తారు. ఆ మంటలు కాస్త పెరిగాక, ఇంట్లో ఉన్న పాత సామాన్లను, అక్కర్లేని చెక్కముక్కలను అన్నింటినీ ఆ మంటల్లో వేస్తారు. అంటే అక్కర్లేని చెత్తను వదిలించుకుని కొత్తదనాన్ని కోరటం కనిపిస్తుంది.
మంచు ఫ్యామిలీ కూడా భోగి పండగను జరుపుకుంది. మోహన్‌బాబు కుటుంబం అంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. చీపురు, చాటలు, పాత వస్తువులు మంటల్లో వేయండని మోహన్‌బాబు చెప్తుండగా అతడి మనవరాలు వాట్స్ దట్ చాట్? (చాట అంటే ఏంటి?) అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న విని బిత్తరపోయిన ఆయన నీకు చాట అంటే తెలీదా అంటూనే దాని గురించి వివరంగా చెప్పేందుకు ప్రయత్నించాడు. మంచు విష్ణు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో చూసిన నెటిజన్లు చాట అంటే తెలీకపోవడమేంటో అని కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment