ఆ డైలాగ్ కేసీఆర్దే- అల్లు అర్జున్ | KCR Inspiration For Allu Arjun | Sakshi
Sakshi News home page

ఆ డైలాగ్ కేసీఆర్దే- అల్లు అర్జున్

Published Sun, Apr 17 2016 5:04 PM | Last Updated on Sun, Jul 14 2019 3:40 PM

KCR Inspiration For Allu Arjun

కేసీఆర్ డైలాగ్నే వాడేసుకున్నానంటున్నాడు అల్లు అర్జున్. సినిమా సినిమాకి ఆసక్తికరమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు ఈ యువ హీరో. అర్జున్ కెరీర్లో ఇప్పటివరకు చేసిన అన్ని పాత్రలు ఒక ఎత్తైతే.. 'రుద్రమదేవి'లో పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర మరో ఎత్తు. గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అభినయం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచి పలువురి ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. ఆ పాత్రలో అల్లు అర్జున్  ఊతపదం 'గమ్మునుండవయ్' అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఆ డైలాగ్ కేసీఆర్దేనంటూ అల్లు అర్జున్ ఇటీవల ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. 
 
గోన గన్నారెడ్డి పాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తెలంగాణ యాసను పూర్తిగా ఒంటబట్టించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశానన్నాడు అల్లు అర్జున్. ఆ క్రమంలోనే రాష్ట్ర విభజనకు ముందు సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలను పదే పదే చూసేవాడట. ఆయన ఎక్కువగా 'గమ్మునుండవయ్య' అనే మాట వాడుతుండటం గమనించాడు. ఈ మాట అయితే ప్రేక్షకులు సులువుగా కనెక్ట్ అవుతారని డిసైడ్ అయ్యాడట. సినిమా విడుదలయ్యాక నిజంగానే అందరూ ఆ పాత్ర తీరుకు, ఆ మాటకు ఫిదా అయిపోయారు. 'ఆ డైలాగ్కి కేసీఆరే నాకు ఇన్స్పిరేషన్' అంటూ అసలు విషయాన్ని బయటపెట్టాడు గోనగన్నారెడ్డి. రూపాయి పారితోషికం తీసుకోకుండా రుద్రమదేవిలో నటించానని చెప్పిన అల్లు అర్జున్, ఆ పాత్ర జీవితంలో మర్చిపోలేనిదంటూ మరోసారి గుర్తుచేసుకున్నాడు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement