సినీ హీరో పేరిట ఓటుకు దరఖాస్తు | unknown person vote card application for allu arjun | Sakshi
Sakshi News home page

సినీ హీరో పేరిట ఓటుకు దరఖాస్తు

Published Thu, Nov 5 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 12:04 PM

సినీ హీరో పేరిట ఓటుకు దరఖాస్తు

సినీ హీరో పేరిట ఓటుకు దరఖాస్తు

పోచమ్మమైదాన్(వరంగల్) : ఇటీవల విడుదలైన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రను హీరో అల్లు అర్జున్ పోషించిన విషయం విదితమే. ఈ మేరకు చరిత్రతో పాటు సినిమాలోనూ రాణి రుద్రమదేవికి అండగా నిలిచే ఆయనకు కాకతీయుల రాజధాని అయిన వరంగల్‌లో ఓటు హక్కు ఉండాలని అనుకున్నారో ఏమో కానీ... గుర్తు తెలియని వ్యక్తులు ఆ దిశగా ముందడుగు వేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో భాగమైన తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కోసం అల్లు అర్జున్ పేరిట గుర్తు తెలియని వ్యక్తులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.

‘అల్లు అర్జున్, తండ్రి అల్లు అరవింద్, ఇంటి నంబర్ 16-10-1452. ఖిలా వరంగల్’ చిరునామాపై దరఖాస్తు రాగా.. వరంగల్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది గురువారం చేపట్టిన పరిశీలనలో ఈ దరఖాస్తును చూసి కంగుతినడం అధికారుల వంతైంది. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వాకాటి కరుణకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించగా.. మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement