రుద్రమ రె‘ఢీ’ | Rudramadevi Movie Release on June 26th | Sakshi
Sakshi News home page

రుద్రమ రె‘ఢీ’

Published Thu, Jun 4 2015 10:39 PM | Last Updated on Sun, Aug 11 2019 12:52 PM

రుద్రమ రె‘ఢీ’ - Sakshi

రుద్రమ రె‘ఢీ’

బాక్సాఫీస్ రణరంగానికి ‘రుద్రమదేవి’ సిద్ధమయ్యారు. ‘బాహుబలి’ చిత్రం కన్నా మరి కాస్త ముందుగా ఈ రుద్రమ రంగంలోకి దూకనున్నారు. అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రల్లో గుణా టీమ్‌వర్క్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో గుణశేఖర్ నిర్మిస్తున్న ఈ తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ త్రీడీ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన రీ-రికార్డింగ్ కార్యక్రమాలు సంగీత దర్శకుడు ఇళయరాజా నేతృత్వంలో 25 రోజుల పాటు లండన్‌లో జరిగాయి. గుణశేఖర్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ జరుగుతోంది.గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటన ఈ చిత్రానికే హెలైట్ . లండన్‌లో రీ-రికార్డింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’ కావడం విశేషం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి ఆర్ట్: తోట తర ణి, కెమెరా: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సమర్పణ: శ్రీమతి రాగిణి గుణ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement