హల్చల్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్ | sardar gabbar sing dialogue | Sakshi
Sakshi News home page

హల్చల్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్

Published Sat, Apr 9 2016 4:37 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

హల్చల్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్ - Sakshi

హల్చల్ చేస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ డైలాగ్

హైదరాబాద్:  ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్  ఆఫీసర్  లుక్  లో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిన  చిత్రం స‌ర్దార్ గ‌బ్బర్  సింగ్‌. తన అభిమానులకు అంకితం అంటూ  మొదలయ్యే ఈ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని  బాబాయ్ అబ్బాయిలు, పవన్ కల్యాణ్,  రామ్ చరణ్ కలసి  స్పెషల్ షో లో సందడి  చేయడం  ఆసక్తికరంగా మారింది.  దీంతో పాటు ఈ సినిమాలో ఉన్న 'బ్రూస్ లీ బాబాయ్' లా ఉన్నాడు అన్న డైలాగ్ ను ఈ హీరోలిద్దరి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారట.  పవర్ స్టార్ ఫైట్ చేస్తుండగా 'బ్రూస్ లీకి బాబాయ్ లా ఉన్నాడన్నా' అనే  డైలాగ్  హాట్ టాపిక్ మారింది.

సర్దార్  గబ్బర్ సింగ్ విడుదలైన శుక్రవారం పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లు ఈ మూవీని ప్రసాద్ కలర్ ల్యాబ్ లో ప్రత్యేకంగా షో వేయించుకుని చూశారు.  నిర్మాత శరత్ మరార్ - డైరెక్టర్ బాబీలు కూడా ఈ షో చూశారు.  తనను, తన సినిమాని గుర్తు చేస్తూ... పవన్ కల్యాణ్ మూవీలో డైలాగ్ ని చెప్పించడాన్ని.. రామ్ చరణ్ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడని అంటున్నారు. దీంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రామ్ చరణ్ లు కలసి కనిపిస్తే చూడాలని సంబరపడుతున్న అభిమానులు కూడా ఈ డైలాగ్ తో పండగ  చేసుకుంటున్నారు. మెగా అభిమానులు ఎంజాయ్ చేసేలా జాగ్రత్త పడ్డ పవన్ కల్యాణ్.. రామ్ చరణ్ బ్రూస్ లీని కూడా ఉపయోగించుకోవడం విశేషమని అభిమానులు తెగ  మురిసిపోతున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement