బెంగళూరు: కర్ణాటకలో దయనీయ దృశ్యం చోటు చేసుకుంది. భర్త అంత్యక్రియలకు ఎవరూ చేయందించకపోవడంతో కొడుకుతో కలిసి ఓ మహిళ భర్త శవాన్ని తోపుడు బండిపై స్మశానానికి తోసుకుంటూ తీసుకెళ్లింది. జూలై 17న కర్ణాటకలోని బెళగావిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గుండె జబ్బుతో బాధపడుతున్న 55 ఏళ్ల సదాశివ్ హిరాతీ అనే వ్యక్తి బుధవారం రాత్రి మరణించాడు. అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలింది. అయితే అతడిని దహన సంస్కారాల కోసం తీసుకువెళ్లేందుకు కుటుంంబ సభ్యులు, బంధువులు కోవిడ్ భయంతో ముందుకు రాలేదు. (10 రోజుల చికిత్సకు రూ.9.09 లక్షలు)
సాయం కోసం ఇంటి పక్కన ఉన్నవారి తలుపులు తట్టినా ఎవరూ ఎవరూ స్పందించలేదు. దీంతో ఆమె కంటనీళ్లతో తన భర్త శవాన్ని తెల్లని వస్త్రంతో కప్పి తోపుడు బండిపై పడుకోబెట్టింది. అనంతరం తన కొడుకుతో కలిసి శవాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్లడానికి సిద్ధమైంది. అలా కొంతదూరం నడిచేసరికి ఓ కూలీ తోపుడు బండి నెట్టేందుకు ముందుకువచ్చాడు. అతని సహాయంతో మూడు నాలుగు కిలోమీటర్లు తోసుకుంటూ నడిచిన తర్వాత స్మశానానికి తీసుకెళ్లి భర్త శవానికి దహన సంస్కారాలు పూర్తి చేసింది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (సీఎం ఇంటి ఎదుట కరోనా బాధితుడి ఆందోళన)
Comments
Please login to add a commentAdd a comment