బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పెద్ద అల్లుడు విరూపాక్ష యమకనమరాది శనివారం పోలీసులతో ఘర్షణకు దిగారు. ఆయన బెలగావిలోని ప్రభుత్వ ఆతిథి గృహం ( సర్క్యూట్ హౌస్ ) నుంచి తన కారులో బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తనను కారులో నెమ్మది వెళ్లమని పోలీసులు సూచించారు. తను వినకపోయే సరికి పోలీసులు కారును అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడై విరూపాక్ష తన కారును ఎందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరుష పదజాలంతో తిట్ల వర్షం కురిపించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సర్క్యూట్ హౌస్ నుంచి బయటకు వచ్చి పోలీసులకు, విరూపాక్షకు మధ్య జరుగుతున్న ఘర్షణను శాంతింపచేశారు. యడియూరప్ప అల్లుళ్లలో పెద్దవాడైన విరూపాక్ష బెలగావికి చెందినవారు. ప్రస్తుతం ఆయన హుబ్లిలో పనిచేస్తున్నారు. తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
యడియూరప్ప అల్లుడు పోలీసులతో వాగ్వాదం
Published Sat, Oct 5 2019 12:49 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
Advertisement