
అంతిమ సంస్కారాల ప్రక్రియ
బొమ్మనహళ్లి: కశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాడుతూ గత శుక్రవారం వీర మరణం పొందిన బెళగావి తాలుకాలోని ఉచగాం గ్రామానికి చెందిన జవాన్ రాహుల్ బైరు సుళగేకర (21)కు కుటుంబం, వేలాది మంది ప్రజలు అశ్రునివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికారు. ఆయన అంత్యక్రియలు మరాఠా సంప్రదాయం ప్రకారం జరిపారు. అంతిమ యాత్రలో గ్రామస్తులతో పాటు పాఠశాలకు చెందిన విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. కశ్మీర్ నుంచి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటకు బెళగావి సాంబ్రా విమానాశ్రయానికి పార్థివ దేహం తీసుకువచ్చారు.
30 కిలోమీటర్లు ఊరేగింపు
అక్కడి నుంచి ఆర్మీ వాహనంలో 30 కిలోమీటర్ల దూరంలోని స్వగ్రామానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. వందలాది మంది నినాదాలు చేసుకుంటూ అనుసరించారు. రాహుల్ అమర్ రహే, భారత్ మాతాకీ జై అని
నినాదాలు చేశారు. మంత్రి జగదీశ్ శెట్టర్, కేంద్రమంత్రి సురేశ్ అంగడి, ఎమ్మెల్యేలు అనిల్ బెనకె తదితరులు పాల్గొన్నా రు. జిల్లా కలెక్టర్ ఎస్‌బీ బొమ్మనహళ్లి, ఎస్పీ లోకేశ్‌కుమార్ తదితరులు నివాళులు అర్పించారు.
భౌతికకాయంపై కప్పిన త్రివర్ణ పతాకాన్ని ఆర్మీ అధికారులు జవాన్ కుటుంబానికి జ్ఞాపకార్థంగా అందించే దృశ్యం చూసి వేలాది మంది హృదయాలు చలించాయి.
Comments
Please login to add a commentAdd a comment