Man Cycling With Snake Around Neck In Karnataka: పామును మెడకు చుట్టుకుని.. సైకిల్‌పై చక్కర్లు! - Sakshi
Sakshi News home page

Viral: పామును మెడకు చుట్టుకుని.. సైకిల్‌పై చక్కర్లు!

Published Tue, Jul 6 2021 1:57 PM | Last Updated on Tue, Jul 6 2021 5:15 PM

Karnataka Man With Snake Around His Neck On Cycle Goes Viral - Sakshi

పాము ఎదురుపడగానే చెమటలు పట్టి వణికిపోతారు ఎవరైనా. నోటమాట రాక నిశ్చేష్టులైపోతారు. ఇక పామును ముట్టుకోవాలంటే ప్రాణాలు పైనే పోతాయి. ఎవరో కొందరు ధైర్యవంతులు మాత్రం సర్పాలతో ఆడుతూ ఔరా అనిపిస్తారు. రెండో కోవకు చెందిన వ్యక్తే ఈ వృద్ధుడు. తన ఇంట్లోకి వచ్చిన పామును పట్టుకుని మెడకు చుట్టుకుని సైకిలెక్కి ఊరంతా చుట్టివచ్చాడు. చూపరులందరూ సంభ్రమాశ్చర్యాలతో నోరెళ్లబెట్టారు.

కర్ణాటకలో బెళగావి జిల్లా హంగరగా గ్రామంలో ఆదివారం ఈ విడ్డూరం చోటుచేసుకుంది. ఓ వృద్ధుని ఇంట్లోకి పాము (జెర్రిపోతు) చొరబడగా ఏమాత్రం చలించకుండా పామును పట్టుకుని మెడకు చుట్టుకున్నాడు. సైకిల్‌ మీద గ్రామంలో సంచరించాడు. కొందరు అతన్ని ఆపి ఆసక్తిగా చూశారు. తరువాత పామును దూరంగా అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.      – బనశంకరి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement