కన్నడ నాట ప్రలోభాల పర్వం! | EC Officials Seize Truck Load Of Pressure Cookers In Belagavi | Sakshi
Sakshi News home page

ప్రెషర్‌ కుక్కర్లతో ఓటర్లకు గాలం..!

Published Sun, Apr 1 2018 9:32 AM | Last Updated on Wed, Sep 5 2018 1:55 PM

EC Officials Seize Truck Load Of Pressure Cookers In Belagavi - Sakshi

యశ్వంతపుర(బెంగళూరు): ఎన్నికల వేళ కన్నడ నాట ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నాయకుల ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రెషర్‌ కుక్కర్ల లోడుతో కూడిన లారీని బెళగావి ఎన్నికల అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. వీటిపై కేపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాల్కర్‌ ఫొటోలతో కూడిన స్టిక్కర్లు ఉండటం గమనార్హం. ఈమె బెళగావి రూరల్‌ నుంచి టికెట్‌ను ఆశిస్తున్నారు. బీజేపీ నేత అనిల్‌ బెనకె ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు వాహన తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా మహారాష్ట్ర నుంచి వస్తున్న ఒక లారీని తనిఖీ చేయగా కుక్కర్లు కనిపించాయి. ఒక్కో కుక్కర్‌ విలువ రూ.700 ఉంటుందని అధికారులు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు వీటిని తరలిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. మే 12న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 15న ఫలితాలు వెలువడతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement