నటి అంజలి అరెస్ట్ అవుతుందా?
చెన్నై : నటి అంజలిని పోలీసులు అరెస్ట్ చేస్తారా అనే ప్రశ్న కోలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. దర్శకుడు కలైంజయం ....ఆమెపై దాఖలు చేసిన పిటిషన్పై చెన్నైలోని సైదాపేట కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు పలుమారు్లు విచారణకొచ్చినా అంజలి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో గత నెల 29న సైదాపేట కోర్టు నాన్బెయిల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ప్రస్తుతం అంజలి తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉన్నట్లు సమాచారం. దాంతో చెన్నై పోలీసులు కోర్టు అరెస్ట్ వారెంట్ను రాజోలు పోలీసులకు గురువారం పంపించినట్లు దర్శకుడు కలైంజయం న్యాయవాది జయప్రకాష్ తెలిపారు. దీంతో అంజలి అరెస్ట్ అవుతుందా లేక అంతకు ముందే కోర్టుకు హాజరు అవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై కోలీవుడ్, టాలీవుడ్లో చర్చ సాగుతోంది.