brutally beaten
-
మార్కులు తక్కువచ్చాయని విద్యార్థులపై దారుణం
సాక్షి, రాజమండ్రి: కరోనా వైరస్ కాలంలోను తల్లిదండ్రులు ధైర్యం చేసి మరీ విద్యార్థులను కళాశాలకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మార్కులు, ర్యాంకుల కోసం కొన్ని కాలేజీలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజోలులోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీ ఓ లెక్చరర్ దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. ఆన్సర్ పేపర్లు ఇస్తూ ఆగ్రహంతో విద్యార్థులను దారణంగా కొట్టాడు. మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థులను విక్షణరహితంగా దండించాడు. భయంతో విద్యార్థులు తరగతి గదిలో లెక్చరర్‌కు దూరంగా వెళ్లినా వారిమీదికి విరుచకపడి మరీ జుట్ట పట్టుకొని చేయిచేసుకున్నాడు. వచ్చిన మార్కులను విద్యార్థులకు చూపిస్తూ ఇలా తక్కువ మార్కులు వస్తే ఎలా? అంటూ ఆవేశంతో విద్యార్థులను కొట్టాడు. అయితే ఈ వీడియోను అదే తరగతి గదిలో ఉన్న ఓ విద్యార్థి సెల్ఫోన్లో రికార్డు చేయగా ఆ వీడియో తాజాగా బయటపడింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు చదువుకోవాలని కాలేజీ పంపితే లెక్చరర్ అనుషంగా ప్రవర్తించడం ఏంటని యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళ వ్యక్తం చేసున్నాయి. చదవండి: ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి -
విద్యార్థిని చితకబాదిన ‘నారాయణ’ టీచర్
సాక్షి, ఆదోని: పట్టణంలోని నారాయణ కార్పొరేట్ పాఠశాలలో ఓ ఉపాధ్యాయురాలు డైరీలో తల్లిదండ్రుల సంతకం తీసుకురాలేదనే నెపంతో ఐదో తరగతి విద్యార్థి బుుషేంద్ర సాయిని చితకబాదింది. గురువారం జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు రేణుక, కృష్ణమూర్తి పాఠశాల వద్దకు చేరుకుని.. ప్రిన్సిపాల్ పవన్‌మహేష్, ఏజీఎం రామిరెడ్డిని నిలదీశారు. కేవలం సంతకం లేదనే నెపంతో టీచర్ విజయలక్ష్మి తమ కుమారుడి చేయిని పురితిప్పి విచక్షణారహితంగా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. చేయినొప్పితో బాధపడుతూ రాత్రంతా నిద్రపోలేదని వాపోయారు. ఫీజుల కోసం ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్లు చేసి వేధించే మీరు.. డైరీలో సంతకం లేనప్పుడు ఆ విషయం తమకు ఫోన్ చేసి చెప్పవచ్చు కదా అని నిలదీశారు. ఈ సంఘటనతో పాఠశాల అంటేనే తమ కుమారుడు భయాందోళన చెందుతున్నాడన్నారు. పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి తిరుమలేష్ మాట్లాడుతూ నారాయణ పాఠశాలలను బాధ్యతారహితంగా నడుపుతున్నారని, గతంలోనూ పాఠశాలలో విద్యార్థులను హింసించారని తెలిపారు. అలాగే విద్యార్థితో కలిసి పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఏజీఎం స్పందిస్తూ విద్యార్థికి ఎలాంటి చికిత్స అయినా తామే చేయిస్తామని, టీచర్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తర్వాత పాఠశాలను పీడీఎస్‌యూ నాయకులు బంద్ చేయించారు. అదేవిధంగా పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని, టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు కూడా ఆందోళన చేపట్టారు. -
దొంగతనం చేశాడన్న అనుమానంతో..
-
మోరల్ పోలిసింగ్ పేరుతో దంపతులను చావబాదారు
-
దురాగతం: దంపతులకు నరకం చూపించారు
బొకారో(జార్ఖండ్): మోరల్ పోలీసింగ్ పేరుతో అనాగరిక చర్యలకు పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. గ్రామ సంరక్షణ పేరుతో తమను తాము మోరల్ పోలీసులుగా చెప్పుకుంటున్న కొందరు యువకులు ఓ జంట పట్ల కర్కశంగా ప్రవర్తించారు. దంపతులను అపార్థం చేసుకుని పట్టపగలే వారికి నరకం చూపించారు. లాఠీలతో ఆ భార్యాభర్తలను చావబాదారు. దెబ్బలకు తాళలేక తమను వదిలేయండని బాధిత మహిళ ఎంత వేడుకున్నా ఆ కర్కోటకులు విడిచిపెట్టలేదు. ఈ ఘటన మంగళవారం బొకారోలో చోటుచేసుకుంది. ఈ దురాగతాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామనీ, దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. దంపతులపై దాడి జరుగుతున్న సమయంలో అక్కడున్న వారంతా చోద్యం చూశారే తప్ప ఎవరూ స్పందించక పోవడం గమనార్హం. -
ఆస్తి రాసివ్వలేదని..అక్కపై అమానుష ఘటన
-
భార్య చేతులను సీలింగ్ ఫ్యాన్‌కు కట్టేసి...
-
కడుపు తరుక్కుపోయే ఘటన
షాజహాన్‌పూర్: కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపించకుండా ఆమె చేతులను సీలింగ్ ఫ్యాన్‌కు కట్టేసి బెల్టుతో విచక్షణా రహితంగా బాదాడు. అంతటితో వూరుకోకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తన అత్తింటివారికి పంపాడు. తాను అడిగిన కట్నం ఇవ్వకపోతే మరింత హింసిస్తానని బెదిరించాడు. కడుపు తరుక్కుపోయే ఈ సంఘటన యూపీలోని షాజహాన్పూర్లో చోటుచేసుకుంది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టింటికి వెళ్లి రూ. 50వేలు కట్నం తీసుకురమ్మని ఆమెను భర్త ఒత్తిడి చేశాడు. బాధితురాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను బెల్టుతో నాలుగు గంటలపాటు విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చేసరికి తన రెండు చేతులను చున్నితో సీలింగ్ ఫ్యాన్‌కు కట్టేశాడని బాధితురాలు తన బాధను మీడియాతో పంచుకుంది. తాను చదువుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని, తన జీవితం నాశనమైపోయిందని ఆమె వాపోయింది. ఈ విషయం గురించి షాజహాన్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ సుమిత్ శుక్లా మాట్లాడుతూ.. బాధితురాలి భర్త ఏ మాత్రం కనికరం లేకుండా తన భార్యను కొడుతున్న వీడియోను తాము చూశామన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాత బాధితురాలి భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు మరో నలుగురి మీద వరకట్న నిషేధం చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
మంటగలిసిన మానవత్వం..
-
టోల్ అడిగినందుకు తోలు తీశారు
గుర్గాం: టోల్ చార్జీని చెల్లించాలని అడిగినందుకు అందులో పనిచేసే వ్యక్తిని చితక్కొట్టారు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాల్లో కూడా రికార్డయింది. చూసిన వారి ఒళ్లు జలదరించేలా టోల్ వసూలు చేసే సహాయకుడిపై ముష్టిఘాతాలకు దిగారు. వివరాల్లోకి వెళితే.. గుర్గామ్ బ్లాక్ సమితి మాజీ చైర్మన్ హోషియార్ సింగ్ శనివారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో ఓ కారులో వెళుతూ ఖైద్కీ దౌలా ప్లాజాను సమీపించారు. ఆ సమయంలో ఆయనను టోల్ చెల్లించాలని అక్షయ్ అనే యువకుడు అడిగాడు. దీంతో తననే టోల్ చేయమంటావా అని ప్రశ్నిస్తూ ఒకేసారి అనూహ్యంగా దాడికి దిగారు. హోషియార్ ఆగ్రహంతో కారులో నుంచి వేగంగా దిగి అక్షయ్‌పై దాడి చేశాడు. అనంతరం అందులోని కంప్యూటర్, ఇతర సామాను పగులగొట్టారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ దొరికిన నేపథ్యంలో దాని ఆధారంగా హోషియార్‌పై గట్టి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. -
విద్యార్ధిపై టీచర్ రాక్షసత్వం
-
పాప ఏడుస్తోందని.. నేలకేసి కొట్టింది!
-
వివస్త్రను చేసి వృద్ధురాలిపై దాడి
గుంటూరు: గుంటూరులో సోమవారం రాత్రి ఒక వ్యక్తి 65 ఏళ్ల వృద్ధురాలిని వివస్త్రను చేసి దాడిచేసిన సంఘటన సంచలనం కలిగించింది. పాతగుంటూరు యాదవుల బజార్లో ఓ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె కూలి పనులు చేస్తూ తల్లిదండ్రులను పోషిస్తోంది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో వృద్ధురాలు ఒక్కతే ఉన్న సమయంలో.. ఆ కుటుంబంతో పరిచయమున్న, కరెంటు పనులు చేసుకునే ఓ వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్లాడు. వృద్ధురాలిపై దాడికి పాల్పడి వివస్త్రను చేశాడు. రాడ్డుతో ఇష్టమొచ్చినట్లు తీవ్రంగా కొట్టి గాయపర్చి వెళ్లిపోయాడు. కొంతసేపటికి ఇంటికి వచ్చిన కుమార్తె రక్తపు మడుగులో ఉన్న తల్లిని గమనించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పాతగుంటూరు పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. -
కన్నపేగే కర్కశంగా మారింది
హైదరాబాద్: నవ మాసాలు మోసిన తల్లే తన కన్న కుమారుడి పట్ల కర్కశంగా మారింది లాలించి గోరుముద్దలు తినిపించాల్సిన వయసులో కాల్చిన కడ్డీతో వాతలు పెట్టింది. ఈ అమానవీయ ఘటన నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ ఎన్.చంద్రబాబు కథనం ప్రకారం... మౌలాలికి చెందిన రేష్మ(22)కు డోర్నకల్‌కు చెందిన అమీర్‌పాషాతో 2008లో పెళైలంది. వీరికి ఇద్దరు కుమారులు. మనస్పర్థలు రావడంతో భార్యాభర్తలు ఇటీవల విడాకులు తీసుకున్నారు. రేష్మా ఏడాది క్రితం భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన మహేష్‌తో రెండో వివాహం చేసుకుంది. పెద్ద కుమారుడు రేష్మా తల్లి దండ్రుల వద్ద ఉంటుండగా, చిన్న కుమారుడు ఆయాన్(5) రేష్మా, మహేష్‌లతో పాటు ఉంటున్నాడు. కాగా రేష్మా సోదరుడు రిజాజ్ ఇటీవల ఆయాన్‌ను తమకు దత్తత ఇవ్వాలని అడిగాడు. దీంతో రూ. 50 వేలు ఇస్తే కుమారుడు ఆయాన్‌ను ఇస్తానని చెప్పింది. రిజాజ్ డబ్బులు ఇవ్వకపోవడంతో రేష్మా కుమారుడు ఆయాన్‌ను ఒంటిపై పెదవులు, పిరుదులు,కాళ్లు,చేతులు, మర్మాంగంపై ఈనెల 4న వాతలు పెట్టింది. రియాన్ తీసుకువెళ్లడానికి మంగళవారం ఇంటికి వచ్చిన రియాజ్ బాలుడి దుస్థితి చూసి వెంటనే నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు . ఇదిలా ఉండగా కుమారుడు ఆయాన్ చెప్పినట్లు వినడం లేదని, కాలనీలో ఉన్న బాయి వద్దకు తరుచు వెళ్తున్నాడని, వెళ్లవద్దని వారించినావినడం లేదని దీంతో భయం పెట్టాలని ఉద్దేశంతో వాతలు పెట్టినటు రేష్మా చెబుతోందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు ఐపిసి 384,324,506 సెక్షన్లప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అభం శుభం తెలియని పసిపిల్లాడి కర్కశంగా వాతలు పెట్టిన కన్న తల్లిపై హత్యా కేసు నమోదు చేసి కఠిన శిక్ష పడేలా చేయాలని మానవ హక్కుల సంఘం నాయకులు అనురాధ డిమాండ్ చేశారు.