గుంటూరు: గుంటూరులో సోమవారం రాత్రి ఒక వ్యక్తి 65 ఏళ్ల వృద్ధురాలిని వివస్త్రను చేసి దాడిచేసిన సంఘటన సంచలనం కలిగించింది. పాతగుంటూరు యాదవుల బజార్‌లో ఓ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె కూలి పనులు చేస్తూ తల్లిదండ్రులను పోషిస్తోంది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో వృద్ధురాలు ఒక్కతే ఉన్న సమయంలో.. ఆ కుటుంబంతో పరిచయమున్న, కరెంటు పనులు చేసుకునే ఓ వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్లాడు. వృద్ధురాలిపై దాడికి పాల్పడి వివస్త్రను చేశాడు. రాడ్డుతో ఇష్టమొచ్చినట్లు తీవ్రంగా కొట్టి గాయపర్చి వెళ్లిపోయాడు.
కొంతసేపటికి ఇంటికి వచ్చిన కుమార్తె రక్తపు మడుగులో ఉన్న తల్లిని గమనించింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పాతగుంటూరు పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు.