కడుపు తరుక్కుపోయే ఘటన | UP Man Brutally Beat His Wife With Belt | Sakshi
Sakshi News home page

భార్య చేతులను సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేసి...

Published Mon, Apr 16 2018 4:59 PM | Last Updated on Sat, Aug 25 2018 4:14 PM

In UP Man Brutally Beat His Wife With Belt And Hung To Ceiling For Dowry - Sakshi

బాధితురాలి ఫొటో

షాజహాన్‌పూర్‌: కట్నం కోసం ఓ ప్రబుద్ధుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడు. సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపించకుండా ఆమె చేతులను సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేసి బెల్టుతో విచక్షణా రహితంగా బాదాడు. అంతటితో వూరుకోకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తన అత్తింటివారికి పంపాడు. తాను అడిగిన కట్నం ఇవ్వకపోతే మరింత హింసిస్తానని బెదిరించాడు. కడుపు తరుక్కుపోయే ఈ సంఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. పుట్టింటికి వెళ్లి రూ. 50వేలు కట్నం తీసుకురమ్మని ఆమెను భర్త ఒత్తిడి చేశాడు. బాధితురాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను బెల్టుతో నాలుగు గంటలపాటు విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చేసరికి తన రెండు చేతులను చున్నితో సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేశాడని బాధితురాలు తన బాధను మీడియాతో పంచుకుంది. తాను చదువుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని, తన జీవితం నాశనమైపోయిందని ఆమె వాపోయింది.

ఈ విషయం గురించి షాజహాన్‌పూర్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ సుమిత్‌ శుక్లా మాట్లాడుతూ.. బాధితురాలి భర్త ఏ మాత్రం కనికరం లేకుండా తన భార్యను కొడుతున్న వీడియోను తాము చూశామన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాత బాధితురాలి భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు మరో నలుగురి మీద వరకట్న నిషేధం చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement