‘ప్రేమ’ విషాదం | love tragedy in bangalore | Sakshi
Sakshi News home page

‘ప్రేమ’ విషాదం

Published Sun, May 8 2016 10:13 AM | Last Updated on Tue, Aug 14 2018 3:14 PM

love tragedy in bangalore

ప్రియురాలికి మరో వ్యక్తితో పెళ్లి జరిగిందని మనస్థాపం చెందిన ప్రియుడు రాఘవేంద్ర ఆత్మహత్య చేసుకోగా, విషయం తెలుసుకున్న ప్రియురాలు అను సైతం నీవు లేని జీవితం నాకెందుకంటూ బలవన్మరణానికి పాల్పడింది.  
 
 
బెంగళూరు :  ప్రియురాలికి మరో వ్యక్తితో వివాహం జరిగిందని మనస్థాపం చెందిన ప్రియుడు ఆత్మహత్యకు పాల్పడగా ఈ విషయం తెల్సిన ప్రియురాలు సైతం బలవన్మరణానికి పాల్పడింది. నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు...హాసన్‌కు చెందిన రాఘవేంద్ర (28) ఏడేళ్ల కిత్రం బెంగళూరుకు చేరుకుని క్యాబ్ డ్రైవర్ పనిచేస్తున్నాడు.
 
ఈ నేపథ్యంలో  విజయనగర్‌కు చెందిన అను (26) అనే యువతితో రాఘవేంద్రకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అను ఇక్కడి ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే అను తల్లిదండ్రులు వీరి పెళ్లికి వ్యతిరేకించి  ప్రశాంత్ అనే వ్యక్తితో అనుకు వివాహం జరిపించారు.
 
అంతకు ముందు తమ ప్రేమ వ్యవహారం గురించి రాఘవేంద్ర ప్రశాంత్‌కు చెప్పినా అతను పెడచెవిన పెట్టి  అనును పెళ్లి చేసుకున్నాడు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన రాఘవేంద్ర డెత్‌నోట్ రాసి శుక్రవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు రాత్రి అను రాఘవేంద్ర మొబైల్‌కు ఫోన్  చేయడంతో అక్కడే ఉన్న పోలీసులు జరిగిన ఘటనను వివరించారు. దీంతో మనో వేదనకు గురైన అను శనివారం ఉదయం తన ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement