కళాశాలకు వెళ్తున్న లెక్చరర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగింది.
కళాశాలకు వెళ్తున్న లెక్చరర్‌పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసిన సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం జరిగింది. కళాశాలలో ఎలక్ట్రానిక్స్ లెక్చరర్ చిట్టెం విజయరాజు ఈరోజు ఉదయం కళాశాలకు వస్తున్న తరుణంలో ముఖానికి ముసుగులు వేసుకున్న ఇద్దరు యువకులు ఇనుప రాడ్లతో ఆయన మీద దాడి చేశారు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గ మనించిన కొందరు విద్యార్థులు దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించే లోపే పరారయ్యారు. లెక్చరర్‌ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చే స్తున్నారు.