
కాలిపోయిన కారు
అనంతపురం: నగరంలోని అశోక్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఓ ఇంటి ముందు ఆపి ఉంచిన కారుకు దుండగులు నిప్పుపెట్టడంతో బాధితులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వన్‌టౌన్ సీఐ రెడ్డెప్ప వివరాలమేరకు.. స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్న చంఽద్రశేఖరరెడ్డి కుటుంబం అశోక్‌నగర్‌లోని హరిహర ఆలయం సమీపంలో నివాసం ఉంటోంది. రోజువారిగానే ఇంటి ముందు కారు (క్రెటా)ను పార్క్ చేశారు.
అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో కారు మంటల్లో తగలబడుతూ కనిపించింది. మంటలను ఆర్పిన అనంతరం చూడగా కారు కింద చెత్తాచెదారాన్ని వేసి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. ఎవరో కావాలనే ఈ పని చేశారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే తమకు ఎవరితోనూ శతృత్వం లేదని చంద్రశేఖర్ చెబుతున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment