అధ్యాపకుడి దుర్మరణం
ఇబ్రహీంపట్నం :
లారీ ఢీకొన్న ప్రమాదంలో జాకీర్‌హుసేన్ కళాశాల తెలుగు అధ్యాపకుడు నాగ సురేష్‌బాబు మృతిచెందాడు. స్థానిక కేరళా హోటల్ సమీపంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కళాశాల నుంచి బయటకు వచ్చిన అనంతరం తన బంధువుల ఇంటికి వెళ్లిన సురేష్‌బాబు రాత్రి 10.30 గంటల సమయంలో తన బైకుపై గొల్లపూడిలోని తన ఇంటికి బయలు దేరాడు. కొద్ది సేపటికే లారీ ఢీకొనడంతో ఆయన మృతిచెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.