- రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం
- జేబులో రెండు పేజీల లేఖ లభ్యం
అనుమానాస్పద స్థితిలో లెక్చరర్ మృతి
Published Thu, Sep 15 2016 12:02 AM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM
రైల్వేగేట్ : వరంగల్ సమీపంలోని ధర్మారం రైల్వేట్రాక్ సమీపంలో ఓ పాలిటెక్నిక్ లెక్చరర్ మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. వరంగల్ జీఆర్‌పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. హన్మకొండలోని నయీంనగర్‌కు చెందిన ఎ¯ŒS. క్రిష్ణమోహ¯ŒS(44) పరకాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అతడు బుధవారం ఉదయం ధర్మారం వద్దగల రైల్వేట్రాక్ పక్కన చనిపోయి ఉండడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఐడీ కార్డు ఆధారంగా అతడు లెక్చరర్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడి భార్య సంధ్యారాణి అలియాస్ దివ్య సంఘటన స్థలానికి చేరుకొని వినాయకుడి ప్రసాదం పంచిపెడుతానని ఇంటి నుంచి వచ్చి ఇలా చనిపోయావా అంటూ విలపించింది. పోలీసులు పంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉండగా కృష్ణమోహ¯ŒS మరణం అనుమానాస్పదంగా ఉన్నట్లు పలువురు చర్చించుకున్నారు. రైలుగాని, మరేదైనాగాని ఢీకొన్న దాఖలాలు ఆయన శరీరం మీద లేకపోవడంతో ఏదైనా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
మృతదేహం వద్ద సూసైడ్ నోట్
‘బీపీ పెరుగుతుంది.. వెరికోస్ ప్రాబ్లం ఉంది.. నాకు నడుం, మెడ నొప్పి తీవ్రంగా ఉంది. అయినా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను. నేను శారీరక వికలాంగుడినని బంధువులు, మిత్రులు అంటున్నారు. నా తల్లిదండ్రులు, పిల్లలు దైవ స్వరూపులు. నా పనే నాకు దైవం, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనాదక్షతను నా తల్లిదండ్రులు చూడలేకపోయారు. కేసీఆర్ అంకిత భావానికి ముగ్దుడనైన నేను అనేక పనులు చేస్తున్నాను. మూడు టెక్టŠస్ బుక్స్ రాసి పబ్లిష్ అయ్యేందుకు ఆయనే స్ఫూర్తి(కేసీఆర్). కేసీఆర్ వలన ఇంకా వంద సంవత్సరాలు పురోగమిస్తుంది. ఇది సత్యం.. నా భార్య, కేసీఆర్ నా జీవిత మార్గదర్శకాలు. – క్రిష్ణమోహ¯ŒS గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్’ అని సూసైడ్ నోట్‌లో రాసి ఉందని జీఆర్‌పీ సీఐ స్వామి వెల్లడించారు.
Advertisement
Advertisement