circumstances
-
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థిని మృతి
మృతదేహంతో బంధువుల ఆందోళన పరకాల : అనుమానాస్పద స్థితిలో ఓ డిగ్రీ విద్యార్థిని మృతిచెందిన సంఘటన రేగొండ మండలంలోని చిన్నకొడెపాక శివారు విజ్జయ్యపల్లిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. రేగొండ మండలంలోని చిన్నకోడెపాక శివారు విజ్జయ్యపల్లికి చెందిన బైకాని పోషాలు కుమార్తె సంధ్య(20) పట్టణంలోని ఎస్వీ డిగ్రీ కళాశాలో సెకండియర్ చదువుతోంది. కళాశాలకు చెందిన బస్సులోనే రోజు అప్ అండ్ డౌన్ చేస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం రోజూలాగే కళాశాలకు వెళ్లి ఇంటికి వచ్చిన సంధ్య పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ప్రైవేటు వాహనంలో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్న క్రమంలోనే మృతిచెందింది. ఇంట్లో ఎలాంటి గొడవలు లేక పోవడంతో కళాశాలలోనే ఏమో జరిగి ఉంటుందని భావించిన కుటుంబ సభ్యులు ఎస్వీ కళాశాల ఎదుట సంధ్య మృతదేహాన్ని వేసి ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ నర్సింహులు, ఎస్సై సుధాకర్ కళాశాల వద్దకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. సంధ్య మృతికి కళాశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి మృతదేహాన్ని తొలగించేది లేదని స్పష్టం చేయడంతో పోలీసులు వెనుదిరిగారు. రాత్రి వరకు బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో లెక్చరర్ మృతి
రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం జేబులో రెండు పేజీల లేఖ లభ్యం రైల్వేగేట్ : వరంగల్ సమీపంలోని ధర్మారం రైల్వేట్రాక్ సమీపంలో ఓ పాలిటెక్నిక్ లెక్చరర్ మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. హన్మకొండలోని నయీంనగర్‌కు చెందిన ఎ¯ŒS. క్రిష్ణమోహ¯ŒS(44) పరకాలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో అతడు బుధవారం ఉదయం ధర్మారం వద్దగల రైల్వేట్రాక్ పక్కన చనిపోయి ఉండడాన్ని గమనించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం వద్ద లభించిన ఐడీ కార్డు ఆధారంగా అతడు లెక్చరర్‌గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతుడి భార్య సంధ్యారాణి అలియాస్ దివ్య సంఘటన స్థలానికి చేరుకొని వినాయకుడి ప్రసాదం పంచిపెడుతానని ఇంటి నుంచి వచ్చి ఇలా చనిపోయావా అంటూ విలపించింది. పోలీసులు పంచనామా చేసి పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. ఇదిలా ఉండగా కృష్ణమోహ¯ŒS మరణం అనుమానాస్పదంగా ఉన్నట్లు పలువురు చర్చించుకున్నారు. రైలుగాని, మరేదైనాగాని ఢీకొన్న దాఖలాలు ఆయన శరీరం మీద లేకపోవడంతో ఏదైనా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహం వద్ద సూసైడ్ నోట్ ‘బీపీ పెరుగుతుంది.. వెరికోస్ ప్రాబ్లం ఉంది.. నాకు నడుం, మెడ నొప్పి తీవ్రంగా ఉంది. అయినా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాను. నేను శారీరక వికలాంగుడినని బంధువులు, మిత్రులు అంటున్నారు. నా తల్లిదండ్రులు, పిల్లలు దైవ స్వరూపులు. నా పనే నాకు దైవం, తెలంగాణ వచ్చాక కేసీఆర్ పాలనాదక్షతను నా తల్లిదండ్రులు చూడలేకపోయారు. కేసీఆర్ అంకిత భావానికి ముగ్దుడనైన నేను అనేక పనులు చేస్తున్నాను. మూడు టెక్టŠస్ బుక్స్ రాసి పబ్లిష్ అయ్యేందుకు ఆయనే స్ఫూర్తి(కేసీఆర్). కేసీఆర్ వలన ఇంకా వంద సంవత్సరాలు పురోగమిస్తుంది. ఇది సత్యం.. నా భార్య, కేసీఆర్ నా జీవిత మార్గదర్శకాలు. – క్రిష్ణమోహ¯ŒS గవర్నమెంట్ పాలిటెక్నిక్ లెక్చరర్’ అని సూసైడ్ నోట్లో రాసి ఉందని జీఆర్పీ సీఐ స్వామి వెల్లడించారు. -
కదిలే టాక్సీలో మహిళ అనుమానాస్పద మృతి
న్యూఢిల్లీ: పంజాబ్ లో జలంధర్ కు చెందిన కమలేష్ (55) అనే మహిళ బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. కదిలే టాక్సీ లో అనూహ్యంగా ఆమె మరణించడం కలకలం రేపింది. కేంద్ర రిజర్వ్ పోలీస్ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఆమె భర్త ఐదు సంవత్సరాల క్రితం మరణించాడు. ప్రభుత్వం నుంచి రావాల్సిన పెన్షన్ వగైరా బకాయిల కోసం ఢిల్లీకి వచ్చిన ఆమె అనుమానాస్పద మరణం అనేక సందేహాలు రేకెత్తించింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం... పంజాబ్ లో జలంధర్ కు చెందిన కమలేష్, భర్త మరణంతో ఓం ప్రకాష్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఐదు సంవత్సరాల క్రితం మరణించిన ఆమె భర్త పెన్షన్, వైద్య పరీక్షల నిమిత్తం ఓంప్రకాష్ తో కలసి రైల్లో ఢిల్లీకి వచ్చారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లేందుకు టాక్సీలో బయలుదేరారు. మార్గ మధ్యలో ఆరోగ్యం విషమించడంతో ఆమె చనిపోయింది. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాథమిక దర్యాప్తు తరువాత మహిళ సహజంగా మరణించినట్టుగా భావిస్తున్నామని పోలీసు డిప్యూటీ కమిషనర్ విక్రంజిత్ సింగ్ తెలిపారు. అయితే శవపరీక్ష తర్వాత పూర్తి వివరాలను వెల్లడి చేస్తామన్నారు. అయితే తన క్యాబ్‌లో కమలేష్, ఓం ప్రకాష్ ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగిందిని టాక్సీ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. అకస్మాత్తుగా అంబులెన్స్ కావాలని, పంజాబ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని ఓం ప్రకాష్ పట్టుబట్టడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశానన్నాడు. గత రెండేళ్లుగా కమలేష్ అనారోగ్యంతో బాధపడుతోందని ఓం ప్రకాష్ పోలీసులకు వివరించాడు. డబ్బులు చెల్లించే విషయంలో టాక్సీ డ్రైవర్ తో వాదన జరిగిందని.. అందుకే అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడని వాదించారు. అటు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఆమె మరణం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు. ఓం ప్రకాష్, టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.