మేలుకొలుపు | individual talent short films | Sakshi
Sakshi News home page

మేలుకొలుపు

Published Sun, Mar 1 2015 11:25 PM | Last Updated on Sat, Sep 2 2017 10:08 PM

మేలుకొలుపు

మేలుకొలుపు

రొటీన్ కథలకు భిన్నంగా సామాజిక అంశాలనే చిత్రాలుగా మలిచాడు ఎ.బద్రి. తీసింది షార్ట్ ఫిల్ములే అయినా... చెప్పదలుచుకుంది సూటిగా, సుత్తి లేకుండా చెప్పి ఆలోచింపజేశాడు. ఆ చిత్రాలను మనమూ ‘షార్ట్’గా చూసేద్దాం రండి...
 
ముందడుగు వేసి చూద్దాం
ఓటు వేయరు గానీ... ప్రభుత్వ బాధ్యత గురించి గంటలు గంటలు చెప్పేస్తుంటారు చాలామంది. తమ కనీస బాధ్యతను విస్మరించి... పక్కవాడికి దాన్ని పదే పదే గుర్తు చేస్తుంటారు. అలాంటిదే ఈ షార్ట్ ఫిల్మ్ కూడా.

ఓటు వేయడం దండగంటూ రూమ్ మేట్‌కు నూరిపోస్తుంటాడు ప్రజాస్వామ్యంపై ఏ మాత్రం గౌరవం లేని వ్యక్తి. ప్రధాన బాధ్యతైన ఓటు వేయకుండా దేశంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తుంటాడు. ఇది సరైన పద్ధతి కాదనే విషయం చివరకు ఇద్దరు చిన్న పిల్లల సంభాషణల ద్వారా అతనికి అర్థమవుతుంది. ఆలోచనా ధోరణి మారుతుంది. ఈ కథనాన్ని ఆసక్తికరంగా నడిపించాడు దర్శకుడు. అనుకున్న మెసేజ్‌ను జనాల్లోకి పాస్ చేయడంలో సఫలమయ్యాడనే చెప్పాలి.
 
సిగ్గు లేదా..!
గతుకుల రోడ్లు... కాయకష్టం చేస్తున్న బడి వయసు చిన్నారులు... ఫుట్‌పాత్‌పై దీనమైన బతుకులు... ఇంటి నుంచి కాలు పెడితే చాలు నిత్యం కనిపించే దృశ్యాలే ఇవి. సామాన్యుడిని అన్నీ కలచివేసేవే. ఇలా చూసి బాధపడితే ప్రయోజనం ఏముంటుంది! మనవల్ల కాదనుకుని వదిలేస్తే ఈ పరిస్థితిలో మార్పు ఎప్పుడు వస్తుంది! ఈ ప్రశ్నలన్నింటికీ ఈ షార్ట్ ఫిల్మ్ ద్వారా ఓ పరిష్కారం చూపే ప్రయత్నం చేశాడు దర్శకుడు. భద్రి వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయినా... షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్న తన అభిరుచి కొనసాగిస్తున్నాడు. మూస కథలు, చిత్రాలకు భిన్నంగా సమాజానికి అంతో ఇంతో సందేశాన్నిస్తున్నాడు.
- ఓ మధు
 

ది లేట్ కమర్స్
పంక్చ్యువాలిటీ పాటించడాన్ని గిల్టీగా ఫీల్ అవుతారు నేటి స్టూడెంట్స్. పైగా కాలేజీకి లేట్‌గా వెళ్లడమంటే అదో పెద్ద క్రెడిట్ వాళ్లకి. చేతిలో బుక్స్ లేకుండా, సెల్ ఫోన్ మాట్లాడుతూ, లేట్‌గా వచ్చి క్లాస్‌లోకి పర్మిషన్ అడిగి, లెక్చరర్‌ని ఏదో ఒకటి అనడం బాగా అలవాటయిపోయిన విద్యార్థులపై సెటైరికల్‌గా ఈ లఘుచిత్రాన్ని రూపొందించాడు శ్రవణ్ కొత్త. ఇంజినీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అడుగు పెట్టిన లెక్చరర్‌కి ఎదురైన చేదు అనుభవాన్ని కథగా మలుచుకుని తీశాడు ఈ షార్ట్ ఫిల్మ్.

ఆలస్యంగా వచ్చిన ప్రతి విద్యార్థీ ఏదో ఒక సాకు చెప్పి లోపలకు వచ్చి కూర్చుంటాడు. చివరికి అందరూ క్లాస్‌కి వచ్చేసరికి పీరియడ్ అయిపోతుంది. కథనం... డైలాగ్స్ బాగున్నాయి. ‘బీయింగ్ లేట్ టు క్లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ నాలెడ్జ్’ అనే మెసేజ్‌తో చిత్రం ముగుస్తుంది. బిగ్‌స్క్రీన్‌పై మక్కువ ఉన్నా అవకాశాలు దొరక్క పోవడంతో తనలోని క్రియేటర్‌ను ఇలా షార్ట్ ఫిల్మ్స్‌తో సంతృప్తి పరుస్తున్నాడు శ్రవణ్. ప్రస్తుతం నగరంలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు.  
- డా. వైజయంతి
 
ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యూత్‌లో యమ క్రేజ్. అలా మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. యూట్యూబ్ లింకులతో సరిపెట్టవద్దు.  వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయుం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement